వారెన్‌ బఫెట్‌ పోలికపై రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా స్పందన వైరల్‌

19 Aug, 2022 18:38 IST|Sakshi

సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్‌ బిగ్‌బుల్‌ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూసి(ఆగస్టు14)రోజులు గడుస్తున్నా....ఆయనకు సంబంధించిన ఏదో ఒక వార్త విశేషంగా  నిలుస్తోంది. ఇండియాలోనే అతిపెద్ద మార్కెట్ పెట్టుబడిదారులలో ఒకరైన రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా ఇన్వెస్ట్‌మెంట్‌ నిపుణుడు మాత్రమే కాదు, మంచి సరదా మనిషి కూడా. తనకోసం  ఏర్పరచుకున్న నిబంధనలతో తనదైన జీవితాన్ని గడిపి,  నచ్చిన పనిచేస్తూ, చేస్తున్న పనిని  మనసారా ఆస్వాదించిన  వ్యక్తిత్వం ఆయనది.  అయితే ‘ఇండియాస్ వారెన్ బఫెట్’గా  తనను పిలవడంపై  గతంలో ఒక  సందర్భంలో  వెలిబుచ్చిన ఆయన తన అభిప్రాయం ఒకటి ఇపుడు వైరల్‌గా మారింది.

"ఒరాకిల్ ఆఫ్ ఒమాహా" లాగా, రాకేష్ ఝున్‌జున్‌వాలా స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ల ద్వారా వేల కోట్ల సంపదను సొంతం చేసుకున్నారు. అందుకే ఆయనను ప్రపంచ పెట్టుబడిదారుడు ‘ఇండియాస్ వారెన్ బఫెట్’ తో పోలుస్తారు. 2012లో వార్తా సంస్థ రాయిటర్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో  "ఇది సరైన పోలిక కాదు (వారెన్ బఫెట్‌తో) అంటూ  సున్నితంగా తిరస్కరించారు. తనతో పోలిస్తే సంపదలోగానీ, సాధించిన విజయాల్లోగానీ, పరిపక్వత పరంగా వారెన్ బఫెట్ చాలా ముందున్నారని చెప్పారు. ముఖ్యంగా  బెర్క్‌షైర్ హాత్వే  సీఈఓగా, 100 బిలియన్లడాలర్లకు పైగా నికర విలువతో, ప్రపంచంలోని 10 మంది ధనవంతులలో ఒకరుగా ఉన్నారని చెప్పుకొచ్చారు. (లక్‌ అంటే టెకీలదే: అట్లుంటది ఐటీ కొలువంటే!)

కాగా 5 వేల రూపాయలతో  రాకేష్‌  ఝున్‌జున్‌వాలా 1986లో స్టాక్‌మార్కెట్‌ అరంగేట్రం చేసిన అద్బుతమైన అంచనాలు, చాతుర్యంతో దేశీయంగా అతిపెద్ద పెట్టుబడి దారుడిగా నిలిచారు. చనిపోయే నాటికి రియల్‌ ఎస్టేట్‌, బ్యాంక్స్‌, ఆటో తదితర  30 కంపెనీల్లో విజయవంతమైన పోర్ట్‌ఫోలియో నిర్మించుకున్నారు. 5.8 బిలియన్ డాలర్ల సంపదను సృష్టించారు. ఇటీవలే ఆకాశ ఎయిర్‌ పేరుతో ఏవియేషన్‌ రంగంలోకి ప్రవేశించారు. కానీ అంతలోనే తీవ్ర అనారోగ్యంతో ఆగస్టు 14న రాకేష్ ఝున్‌ఝున్‌వాలా చనిపోవడంతో వ్యాపార వర్గాలు,  అభిమానులతోపాటు యావత్‌ భారతదేశం  దిగ్భ్రాంతి లోనైంది.

మరిన్ని వార్తలు