Rule of 72: మీరు పెట్టిన పెట్టుబడి ఎన్ని ఏళ్లలో రెట్టింపవుతుంది?

19 Sep, 2021 18:17 IST|Sakshi

సామాన్య ప్రజానీకం నుంచి ధనిక వర్గ ప్రజల వరకు తాము సంపాదిస్తున్న సంపాదనలో ఎంతో కొంత మొత్తం పెట్టుబడులు పెట్టాలని ఈ మధ్య కాలంలో ఆలోచిస్తున్నారు. అయితే, ఇలా పెట్టిన పెట్టుబడి రెట్టింపు కావడానికి ఎన్ని ఏళ్లు పడుతుంది అనే సందేహం మనలో చాలా మందికి వస్తూ ఉంటుంది?. మనం ఏదైనా మ్యూచువల్‌ ఫండ్లలో ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెడితే అది ఎన్ని ఏళ్లలో రెట్టింపు అవుతుంది?. ఇలాంటి సందేహాలను అనేక వస్తాయి. ఈ సందేహాలు నివృత్తి చేసుకోవడం కోసం ఓ నిర్దిష్టమైన నియమం ఉంది. దాన్నే మనం థంబ్‌ రూల్‌ 72/రూల్ ఆఫ్ 72 అని పిలుస్తాము. ఇది చక్రవడ్డీ ఆధారంగా పనిచేస్తుంది.

రూల్ ఆఫ్ 72 ఫార్ములా: 72/ వడ్డీ రేటు = ఎన్ని ఏళ్లలో రెట్టింపు అవుతుంది

ఉదాహరణకు మనం ఏదైనా కొంత మొత్తాన్ని 12 శాతం వడ్డీ ఒక నిర్దిష్టమైన రాబడి ఇచ్చే పథకంలో పెట్టుబడి పెడితే ఆ మొత్తం రెట్టింపు కావడానికి కనీసం 6 ఏళ్లకు పైగా పడుతుంది. ఉదాహరణకు మీరు ఒక రూ.10 లక్షలు పెట్టుబడిగా పెడదామని అనుకున్నారు. ఓ పదేళ్ల తర్వాత అది రెట్టింపు కావాలనుకుంటే థంబ్‌ రూల్‌ 72 ప్రకారం 7.2 శాతం రాబడి ఉండాలి. ఇలా 7.2శాతం రాబడినిచ్చే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లేదంటే మ్యూచువల్‌ ఫండ్లలో ఏదో ఒక దానిని ఎంచుకొని వాటిలో పెట్టుబడి పెట్టొచ్చు. కొన్న ఉదాహరణలు ఇచ్చాము క్రింద చూడండి.(చదవండి: 20 నిమిషాల ఛార్జింగ్‌తో 482 కి.మీ ప్రయాణం..!)

  • 1%తో మీ డబ్బు రెట్టింపు కావడానికి 72 సంవత్సరాలు పడుతుంది (72/ 1 = 72)
  • 3%తో మీ డబ్బు రెట్టింపు కావడానికి 24 సంవత్సరాలు పడుతుంది (72 / 3 = 24)
  • 6%తో మీ డబ్బు రెట్టింపు కావడానికి 12 సంవత్సరాలు పడుతుంది (72 / 6 =12)
  • 9%తో మీ డబ్బు రెట్టింపు కావడానికి 8 సంవత్సరాలు పడుతుంది (72 / 9 = 8)
  • 12%తో మీ డబ్బు రెట్టింపు కావడానికి 6 సంవత్సరాలు పడుతుంది (72/12 = 6)
  • 18%తో మీ డబ్బు రెట్టింపు కావడానికి 4 సంవత్సరాలు పడుతుంది (72/18 = 4)
  • 24%తో మీ డబ్బు రెట్టింపు కావడానికి 3 సంవత్సరాలు పడుతుంది (72/24 = 3)

గమనిక: ఇది కచ్చితమైన ఫలితాలు ఇవ్వదు కొంత తేడా ఉంటుంది అనే విషయం గమనించాలి.

మరిన్ని వార్తలు