WhatsApp: త్వరలో వాట్సాప్ కొత్త ఫీచర్ - భద్రతకు పెద్దపీట!

12 Jul, 2023 18:45 IST|Sakshi

WhatsApp Phone Number Privacy: ఆధునిక కాలంలో కొత్త యాప్స్ లాంచ్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే ఉన్న యాప్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' (WhatsApp) త్వరలో మరో అప్డేట్ అందుకోనుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, వాట్సాప్ త్వరలో 'ఫోన్ నెంబర్ ప్రైవసీ' అనే లేటెస్ట్ ఫీచర్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ప్రైవసీ విషయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు మాత్రమే కాకుండా ఐఫోన్ యూజర్లందరికి అందుబాటులో ఉంటుంది. అయితే వాట్సాప్ అప్డేటెడ్ బీటా యూజర్లకు మాత్రమే ఇది వర్తించే అవకాశం ఉందని సమాచారం.

(ఇదీ చదవండి:  షాకిచ్చిన ఇన్ఫోసిస్.. తీవ్ర నిరాశలో ఉద్యోగులు - కారణం ఇదే!)

వాట్సాప్ లేటెస్ట్ ఫీచర్ కమ్యూనిటీ యూజర్లు మాత్రమే ఉపయోగించగలరు. ఒక యూజర్ తన ఫోన్ నెంబర్ తెలియనివారికి కనిపించకుండా ఉండాలనుకున్నప్పుడు వాట్సాప్ సెట్టింగ్స్‌లో ఫోన్ నెంబర్ ప్రైవసీ అనే ఫీచర్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ సెలక్ట్ చేసుకున్నప్పుడు యూజర్ మొబైల్‌లో సేవ్ అయిన కారికి మాత్రమే కనిపిస్తుంది. ఇతరులకు కనిపించే అవకాశం లేదు. ఇది యూజర్ భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టంగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు