ఇక వాట్సాప్‌ మెసెజ్‌లు ఆటో డిలీట్‌

23 Nov, 2020 11:53 IST|Sakshi

దేశీయంగా అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్‌

ఆప్షన్‌ ఎంచుకుంటే 7 రోజుల్లోగా మెసేజీలు డిజెప్పీర్‌

మెసేజీలు, మీడియా ఫైల్స్‌కూ ఈ ఫీచర్‌ వర్తిస్తుంది

వినియోగదారులు మాన్యువల్‌గా ఎంపిక చేసుకోవాలి

గ్రూప్‌ చాటింగులలో అయితే అ‍డ్మిన్‌లకే ఈ అవకాశం

ముంబై, సాక్షి: మెసెజీలు, మీడియా ఫైల్స్‌ను వారం రోజుల్లో ఆటోమాటిక్‌గా డీలిట్‌ అయ్యే ఫీచర్‌ దేశీయంగా వాట్సాప్‌ వినియోగదారులకూ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌, డెస్క్‌టాప్‌, కేఏఐవోఎస్‌, వెబ్‌ తదితరాలలో ఈ ఫీచర్‌ను వినియోగంలోకి తీసుకొచ్చినట్లు వాట్సాప్‌ తాజాగా పేర్కొంది. అయితే వినియోగదారులు ఈ ఫీచర్‌ను మాన్యువల్‌గా ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. తద్వారా వాట్సాప్‌ మెసేజీలు 7 రోజుల తదుపరి ఆటోమాటిగ్గా డీలిట్‌ అవుతాయి. ఈ ఫీచర్‌ గ్రూప్‌ చాట్స్‌కు సైతం వినియోగించుకోవచ్చు. గ్రూప్‌లలో అయితే ఈ ఫీచర్‌ ఎనేబుల్‌ లేదా డిజుబుల్‌ సౌకర్యం.. అడ్మిన్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

ఎలా చేయాలంటే?
వాట్సాప్‌ కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన మెసెజ్‌ ఆటో డిలీట్‌ సౌకర్యాన్ని పొందాలంటే..  ఆండ్రాయిడ్‌ లేదా ఐవోఎస్‌ వినియోగదారులు తొలుత వాట్సాప్‌ చాట్‌ ఓపెన్‌ చేయాలి. కాంటాక్ట్‌ పేరును ఎంపిక చేసుకుని డిజెప్పీరింగ్‌ మెసేజెస్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అపై కంటిన్యూ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. ఈ విధానం డెస్క్‌టాప్‌, వెబ్‌, కేఏఐవోఎస్‌ వినియోగదారులకు సైతం అందుబాటులో ఉంటుందని వాట్సాప్‌ పేర్కొంది. ఇక గ్రూప్‌ చాట్‌లలో అయితే అడ్మిన్‌లు గ్రూప్‌ చాట్‌ను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. గ్రూప్‌ పేరు, డిజెప్పీరింగ్‌ మెసేజెస్‌, కంటిన్యూపై క్లిక్‌ చేస్తే సరిపోతుంది. కాగా.. ఆటో డౌన్‌లోడ్‌ ఆప్షన్‌గనుక ఉన్నట్లయితే మెసేజీలు ఫోన్‌మెమరీలో స్టోర్‌ అవుతాయి. ఫలితంగా వారం రోజుల్లో చాట్స్‌ నుంచి మాత్రమే డీలిట్‌ అవుతాయని వాట్సాప్‌ తెలియజేసింది. ఆటో డిలీట్‌ ఆప్షన్‌ను ఎంచుకోకముందు చాట్‌లపై ఈ ఫీచర్‌ ప్రభావం చూపబోదని ఈ సందర్భంగా వాట్సాప్‌ తెలియజేసింది. ఇక డిజెప్పీర్‌ ఆప్షన్‌ లేని కాంటాక్ట్‌కు వీటిని ఫార్వార్డ్‌ చేస్తే.. ఈ మెసేజీలు అక్కడ డీలిట్‌కావని వివరించింది. ఒకవేళ ఈ ఫీచర్‌ ఎవరి ఫోన్‌లోనైనా కనిపించకుంటే.. ఆయా వినియోగదారులు లేటెస్ట్‌ వెర్షన్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవలసి ఉంటుందని సూచించింది.   

మరిన్ని వార్తలు