Whatsapp Accounts Banned: వాట్సాప్‌ యూజర్లకు షాక్‌.. ఒక్క జూన్‌లోనే 22 లక్షల అకౌంట్లు బ్యాన్‌!

3 Aug, 2022 11:51 IST|Sakshi

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడిన యూజర్లపై మరో సారి కొరడా ఘుళిపించింది. భారత్‌లో జూన్‌ ఒక్క నెలలోనే ఏకంగా 22 లక్షల వాట్సాప్‌ అకౌంట్లను బ్యాన్‌ చేసింది. వాట్సాప్‌కు అందిన ఫిర్యాదులు, ఉల్లంఘనలను గుర్తించే మెకానిజం ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొందరు యూజర్లు నిబంధనలకు విరుద్ధంగా ఫేక్‌ న్యూస్‌ షేర్‌ చేయడం, అనధికారిక మెసేజలు వ్యాప్తి, విద్వేషపూరిత ప్రసంగాలు లాంటివి చేస్తున్నారని అందుకే వారి అకౌంట్లను బ్యాన్‌ చేసినట్లు వెల్లడించింది. 

కాగా మే నెలలో 19 లక్షలకు పైగా అకౌంట్లకుపై నిషేధం విధించింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్‌లతో యూజర్ల డేటా సురక్షితంగా ఉంచేందుకు వాట్సాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నామని, దీనిపై నిరంతరం నిపుణుల పర్యవేక్షణ ఉంటుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. గతేడాది నుంచి అమలులోకి వచ్చిన ఇన్ఫర్మేషన్‌ రూల్స్‌ 2021 నియమాల ప్రకారం 50 లక్షలకు పైగా యూజర్లు కలిగిన సోషల్‌ మీడియాలో అవాస్తవాలు, హింస ప్రేరేపిత, తప్పుడు వ్యాఖ్యలపై అందిన ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకోవాలి. నిషేధించిన అకౌంట్ల వివరాలు ప్రతి నెలా వెల్లడించాల్సి ఉంటుంది.  

చదవండి: వడ్డీ ఎక్కువైనా లోన్‌ యాప్స్‌ నుంచి రుణం

మరిన్ని వార్తలు