Whatsapp : మీకు ఈ మెసేజ్‌ వస్తుందా! మరేం పర్లేదు

10 Aug, 2021 10:38 IST|Sakshi

వాట్సాప్‌ యూజర్ల ఆందోళనపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించారు. ఇటీవల వాట్సాప్‌ వినియోగదారులకు వింత సమస్య ఎదురైంది. ఆన్‌లో ఉన్న వాట్సాప్‌ ఒక్కసారిగా లాగ్‌ అవుట్‌ అవుతుంది. వెంటనే మీరు ఉపయోగిస్తున్న ఫోన్‌లో ఈ నెంబర్‌ వాట్సాప్‌ లేదు. బహుశా వేరే ఫోన్‌లో ఈ నెంబర్‌ వాట్సాప్‌ ఉంటుందేమో.. ఒక్కసారి చెక్‌ చేయండి లేదంటే మీ ఫోన్‌ నెంబర్ ను వెరిఫై చేసుకోండంటూ ఓ మెసేజ్‌ వచ్చింది.

దీంతో ఆ మెసేజ్‌పై వాట్సాప్‌ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు.వాట్సాప్‌ హ్యాక్‌ అయ్యిందేమో? ఎవరన్నాహ్యాక్‌ చేశారేమో చెక్‌ చేయండి అంటూ వాట్సాప్‌కు రిక్వెస్ట్‌లు పెట్టారు. దీంతో యూజర్ల రిక్వెస్ట్‌ వాట్సాప్‌ రియాక్ట్‌ అయ్యింది. మీ ఫోన్‌ ను ఎవరూ హ్యాక్‌ చేయలేదు. బ్యాక్ ఎండ్ కోడ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సమస్య గురించి యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తిరిగి వాట్సాప్‌లోకి లాగిన్‌ అవ్వొచ్చని డబ్ల్యూఏబీటా ఇన్ఫో ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. దీంతో యూజర్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. 
 

మరిన్ని వార్తలు