మన చాట్స్ సురక్షితమేనా? వాట్సాప్ ఏమంటోంది?

25 Sep, 2020 09:13 IST|Sakshi

 యూజర్ల సెక్యూరిటీకి ఢోకాలేదు.. పూర్తి నిబంధనలు పాటిస్తున్నాం

థర్డ్ పార్టీలకు యాక్సెస్ లేదు

పాస్‌వర్డ్‌లు లేదా బయోమెట్రిక్ ఐడీలు  పాటించండి

సాక్షి, న్యూఢిల్లీ : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు మాదక ద్రవ్యాల కేసుగా మారడం, ఇందులో వాట్సాప్ చాట్ కీలకంగా మారిన నేపథ్యంలో సోషల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ స్పందించింది. ఆపరేటింగ్ సిస్టమ్ తయారీదారులు అందించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని, దీంతో యూజర్ల భదత్రకు ఎలాంటి ముప్పు లేదని వెల్లడించింది. వాట్సాప్ మెసేజ్ లు పూర్తిగా సురక్షితమని, ధర్డ్ పార్టీలు వాటిని యాక్సెస్ చేయలేవంటూ యూజర్లకు భరోసా ఇస్తోంది. ఈ మేరకు వాట్సాప్ ఒక ప్రకటన విడుదల చేసింది.  (డ్రగ్స్: హీరోయిన్లు మాత్రమేనా? హీరోల మాటేమిటి?)

వాట్సాప్ సందేశాలకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటెక్షన్ అందిస్తున్నామని తద్వారా మీరు, మీరు కమ్యూనికేట్ చేస్తున్నవ్యక్తి మాత్రమే ఆయా సందేశాలను చదవగలరు. తప్ప, మధ్యలో ఎవరూ దీన్ని యాక్సెస్ చేయలేరని స్పష్టం చేసింది. ఫోన్ నంబర్‌ను మాత్రమే వాట్సాప్‌లో ఉపయోగిస్తారు కనుక మిగతా సమాచారం లీక్ అయ్యే అవకాశం లేదని వాట్సాప్ ప్రతినిది ఒకరు తెలిపారు. అలాగే ఫోన్ డాటాను ఇతరులు యాక్సెస్ చేయకుండా బలమైన పాస్‌వర్డ్‌లు లేదా బయోమెట్రిక్ ఐడీలు వంటి అన్ని భద్రతా ఫీచర్లను సద్వినియోగం చేసుకోవాలని యూజర్లకు విజ్ఞప్తి చేశారు. 

కాగా సుశాంత్ అనుమానాస్పద మరణం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి, మహేష్ భట్ మధ్య వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ తోపాటు, టాలెంట్ ఏజెంట్ జయ సాహా సెల్‌ఫోన్ నుంచి సేకరించిన 2017 నాటి వాట్సాప్ చాట్ వ్యవహాం హాట్ టాపిక్ గా మారింది. ఈ చాట్‌ల ఆధారంగా నార్కో‌టిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎ‌న్‌‌సీబీ) బాలీవుడ్ హీరోయిన్స్ సారా ఆలీఖాన్, దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్‌, టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లాంటి నటులకు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఈ ప్రకటన జారీ చేసింది. 

మరిన్ని వార్తలు