వాట్సాప్‌.. చాట్‌ బ్యాకప్‌ను డ్రైవ్‌లో స్టోర్‌ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే..

11 Sep, 2021 10:50 IST|Sakshi

వాట్సాప్‌.. పర్సనల్‌ మెసేజింగ్‌ యాప్‌.  ఇద్దరి మధ్యగానీ, గ్రూపులోగానీ సంభాషణలకు, వ్యక్తిగత కాల్స్‌కు ఇంటర్నెట్‌ స్వేచ్ఛతో అనుమతించ్చే యాప్‌. అయితే వాట్సాప్‌లో యూజర్‌ భద్రత గురించి బోలెడు అనుమానాలు ఉన్నాయి. దీనికితోడు ఈమధ్య కాలంలో ఫేస్‌బుక్‌ స్వయంగా వాట్సాప్‌ యూజర్ల డాటాపై కన్నేసిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ తరుణంలో యూజర్ల కోసం ఓ గుడ్‌న్యూస్‌ చెప్పింది వాట్సాప్‌.
 

ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా యూజర్‌ చాట్‌ డాటాకు భద్రత భరోసా ఇస్తున్న వాట్సాప్‌.. ఇప్పుడు మరో ప్రైవసీ అప్‌డేట్‌ ఇచ్చింది. చాట్‌ బ్యాకప్‌ల విషయంలోనూ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వర్తిస్తుందని ప్రకటించింది. ‘‘ఒకవేళ ఎవరైనా వాట్సాప్‌ హిస్టరీని బ్యాక్‌ అప్‌ చేసినప్పుడు  ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కోరుతుంది. అది కేవలం వాళ్లకు మాత్రమే కనిపిస్తుంది. సంబంధిత డ్రైవ్‌లోని సమాచారాన్ని ఎవరూ అన్‌లాక్‌ చేయలేరు’’ అని ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ గురువారం వెల్లడించాడు.

క్లిక్‌: ఫేస్‌బుక్‌ వల్లే న్యూడిటీ ప్రమోషనా? 

అయితే సంబంధిత డ్రైవ్‌ల్లో(ఐక్లౌడ్స్‌ లేదంటే గూగుల్‌ డ్రైవ్‌) ‘ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కీ’ సాయంతో యాసెస్‌కి అనుమతి ఉంటుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఫీచర్‌ యూజర్‌కు అందుబాటులో రానుంది. అయితే ఇక్కడో ట్విస్ట్‌ ఏంటంటే.. ఇది డిఫాల్ట్‌గా ఆన్‌ కాదు. పాస్‌వర్డ్‌ని క్రియేట్‌ చేసుకోవడం గానీ,   64 డిజిట్‌ ఎన్క్రిప్షన్ కీ మీద యూజర్‌ ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ పాస్‌వర్డ్‌ గనుక మర్చిపోతే.. అకౌంట్‌ రికవరీకి వాట్సాప్‌​ కూడా ఎలాంటి సాయం అందించలేదు. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల మందికి పైగా వాట్సాప్‌ను ఉపయోగిస్తుండగా.. భారత్‌లో యూజర్ల సంఖ్య 40 కోట్లకు పైనే అని ఓ అంచనా.  

చదవండి: ఫేస్‌బుక్‌ కాదు.. పక్కా ఫేక్‌ బుక్‌

మరిన్ని వార్తలు