వాట్సాప్ గ్రీవియన్స్ ఆఫీసర్ రాజీనామా?

2 Dec, 2021 16:56 IST|Sakshi

ఇండియాలో కొత్త ఐటీ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ ఈ ఏడాది జూన్ నెలలో గ్రీవియన్స్ & నోడల్ అధికారిగా న్యాయవాది పరేష్ బి లాల్‌ను వాట్సాప్ నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వాట్సాప్ గ్రీవియన్స్ & నోడల్ అధికారి న్యాయవాది పరేష్ బి లాల్ తన పదివికి రాజీనామా చేసినట్లు సమాచారం. తన పదవి నుంచి తప్పుకోవడంతో మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఇప్పుడు అతని స్థానంలో కొత్త వ్యక్తిని నియమించినట్లు బిజినెస్ ఇన్ సైడర్ కథనం తెలిపింది.

ప్రస్తుతం, అతని స్థానంలో వరుణ్ లాంబాను వాట్సప్ గ్రీవియెన్స్ ఆఫీసర్‌గా నియమించినట్లు తెలుస్తుంది. భారతదేశంలోని కొత్త ఐటి నియమాల ప్రకారం.. భారతదేశానికి చెందిన ముగ్గురిని చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ వ్యక్తి, గ్రీవియెన్స్ ఆఫీసర్‌గా నియమించాల్సి ఉంటుంది. పరేష్ బి లాల్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అతను మే నుంచి అక్టోబర్ 2021 మధ్య 'అటార్నీ-గ్రీవియెన్స్ ఆఫీసర్ & నోడల్ ఆఫీసర్'గా వాట్సప్లో పనిచేశారు. అయితే,  అతని నిష్క్రమణకు కారణం ఇంకా తెలియదు. ఇంతకు ముందు చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్‌గా మే 2021లో ఒకరిని నియమించినట్లు సమాచారం. అయితే, దీని గురుంచి అధికారిక సమాచారం అందుబాటులో లేదు.

(చదవండి: బ్యాంకు ఖాతాదారులకు షాక్.. జనవరి 1 నుంచి?)

>
మరిన్ని వార్తలు