WhatsApp: వాట్సాప్‌ అప్‌డేట్‌ చేసిన ఈ ఆప్షన్‌ గురించి మీకు తెలుసా!

3 Jul, 2022 12:43 IST|Sakshi

ప్రముఖ మెసేజింగ్‌ ఫ్లాట్‌ ఫామ్‌ వాట్సాప్‌ యూజర్లకు శుభవార్త. యూజర్ల సౌలభ్యం కోసం  వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్‌లు, ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పటికే ఉన్న 'డిలీట్‌ ఫర్‌ ఎవరివన్‌'  ఆప్షన్‌ను ఆప్‌డేట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. 

వాట్సాప్‌ బ్లాగ్‌ వీ బీటా ఇన్ఫో ప్రకారం..యూజర్లు సెండ్‌ చేసిన మెసేజ్‌లలో ఏదైనా మిస్టేక్‌ ఉంటే డిలీట్‌ చేసే సదుపాయం ఉంది.అయితే పొరపాటు ఉన్న ఆ మెసేజ్‌లను టైంకి డిలీట్‌ చేయకపోతే ఎన్ని అనార్ధాలు జరుగుతాయో మనకు తెలియంది కాదు. ఆ సమస్యకు పరిష్కార మార్గంగా వాట్సాప్‌ 2017లో డిలీట్‌ ఫర్‌ ఎవిరివన్‌ ఆప్షన్‌ను యూజర్లకు పరిచయం చేసింది.

ఇక ఆ సమస్య తీరినట్లే 
పొరపాటున మీ వాట్సాప్‌లో మీ కుటుంబ సభ్యులకు,స్నేహితులకు పంపిన మెసేజ్‌లు, వీడియోలు, ఫోటోలు పంపితే.. వాటిని డిలీట్‌ చేసే టైం 1గంట,8 నిమిషాల,16 సెకన్లలోపు ఎప్పుడైనా డిలీట్‌ చేయోచ్చు. ఆ తర్వాత వాటిని డిలీట్‌ చేయాలన్నా సాధ్యపడేది కాదు. అందుకే ఆ టైం ఫ్రేమ్‌ను పొడిగిస్తూ డిలీట్‌ ఫర్‌ ఎవరివన్‌ ఆప్షన్‌ను అప్‌డేట్‌ చేసింది. ఈ అప్‌డేట్‌ ప్రకారం.. మిస్టేక్‌ ఉన్న మెసేజ్‌లను డిలీట్‌ చేసేందుకు 2రోజుల 12గంటల సమయం వరకు పొడిగించింది. ప్రస్తుతం ఈ ఆప్షన్‌ టెస్టింగ్‌ దశలో ఉండగా.. త్వరలో అందరికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు వీ బీటా ఇన్ఫో తన బ్లాగ్‌లో పేర్కొంది.

మరిన్ని వార్తలు