‘వాట్సాప్‌ ఇండియా హెడ్‌ అభిజిత్‌ బోస్‌ రాజీనామా’..చేశారా!..తొలగించారా!

15 Nov, 2022 20:08 IST|Sakshi

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం మెటాకు భారీ షాక్‌ తగిలింది. వాట్సాప్‌ ఇండియా హెడ్‌ అభిజిత్‌ బోస్‌ తన పదవికి రాజీనామా చేశారు. వాట్సాప్‌లో యూపీఐ పేమెంట్స్‌తో పాటు, ఇన్‌ స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ను  దేశ ప్రజలందరికి చేరువ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన బోస్‌ ఉన్న పళంగా రిజైన్‌ చేయడం చర్చాంశనీయంగా మారింది.   

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వారం రోజుల క్రితం తమ సంస్థలో పని చేస్తున్న వారిలో దాదాపు 13 శాతం అంటే  11,000 మందికి పైగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తొలగింపు నిర్ణయం తీసుకున్న వారం రోజుల తర్వాత వాట్సాప్‌ ఇండియాకు అభిజిత్‌ బోస్‌ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.అయితే ఆయన రాజీనామా చేశారా? లేదా జుకర్‌ బర్గ్‌ తొలగించిన వారిలో ఈయన కూడా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది.  . 

కాగా, అభిజిత్‌ రిజైన్‌ను వాట్సాప్‌ గ్లోబల్‌ హెడ్‌ విల్‌ కాథ్‌ కార్ట్‌ ధృవీకరించారు. ‘వాట్సాప్ ఇండియా మొద‌టి హెడ్‌గా ఎన‌లేని సేవ‌లు అందించిన అభిజిత్‌కు ధ‌న్య‌వాదాలు. వాట్సాప్‌లో కొత్త సేవ‌లు ప్రారంభించ‌డానికి, వాట్సాప్ వ్యాపారం పెర‌గ‌డానికి అత‌ని ఎంట్ర‌ప్రెన్యూర్ స్కిల్స్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయి’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు