వాట్సాప్‌ కొత్త ఫీచర్లు, ఫేస్‌ రికగ్నైజేషన్‌తో లాక్‌ వేయొచ్చు..!

22 Nov, 2021 18:55 IST|Sakshi

వాట్సాప్‌ రెండు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా వాట్సాప్‌ అప్‌డేట్‌ చేసిన ఈ ఫీచర్లు బాగున్నాయని, యూజర్ల భద్రత పరంగా ఇప్పటి వరకు విడుదలైన ఫీచర్ల కంటే కొత్తగా అప్‌డేట్‌ చేసిన ఫీచర్ల ఉపయోగం ఎంతో ఉందని టెక్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

వాట్సాప్‌ ఫ్లాష్‌ కాల్స్‌, మెసేజ్‌ లెవల్‌ రిపోర్టింగ్ ఫీచర్లను విడుదల చేసింది. యూజర్ల సెక్యూరిటీ కోసం ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ తో ఫ్లాష్‌ కాల్స్‌ ఫీచర్‌ను విడుదల చేసింది. వాట్సాప్‌ ఇన్‌ స్టాల్‌ సమయంలో జరిగే ప్రాసెస్‌లో ఎస్‌ఎంఎస్‌ వెరిఫికేషన్‌ తప్పని సరి చేసింది. అంతేకాదు కాంటాక్ట్‌లను బ్లాక్ చేయడం, ఎవరితో ఏం షేర్ చేయాలనే దానిని కంట్రోల్ చేయడం, అవసరమైన వాట్సాప్‌ మెసేజ్‌లను సీక్రెట్‌గా స్టోర్‌ చేయడం, టచ్ ఐడి లేదా ఫేస్ ఐడితో యాప్‌ను లాక్ చేయడం వంటి సెక్యూరిటీ సౌకర్యాలు కొత్తగా తెచ్చిన ఫీచర్లలలో ఉన్నాయని వాట్సాప్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో తెలిపింది. అంతే కాదు ఈ ఫ్లాష్ కాల్ ఫీచర్ లో యూజర్లు కొత్త ఫోన్‌లో వాట్సాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసే సమయంలో ఎస్‌ఎంస్ వెరిఫికేషన్‌, ఆటోమేటెడ్ కాల్ ద్వారా ఫోన్ నంబర్‌ను యాక్సెప్ట్‌ చేసే ఆప్షన్‌ కోసం ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది.  

మరో మెసేజ్‌ లెవల్‌ రిపోర్టింగ్ ఫీచర్‌  యూజర్ల ప్రొఫైల్ ఫోటో, చివరిగా చూసిన యూజర్లు ఎవరు, చూసిన వారిలో అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారా? ఉంటే వారిని నియంత్రించవచ్చు. అవసరం అనుకుంటే బ్లాక్‌ చేయొచ్చు. అంతేకాదు సెక్యూరిటీ దృష్ట్యా రెండు సార్లు వెరిఫికేషన్‌ కూడా చేసుకునే సదుపాయం కల్పిస్తుంది.  మొత్తం వాట్సాప్‌ చాట్‌కోసం ప్రైవసీ సెట్టింగ్‌ను తెచ్చింది.

మరిన్ని వార్తలు