Apple: ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..!

17 Aug, 2021 15:27 IST|Sakshi

ఆపిల్‌ యూజర్లకు వాట్సాప్‌ గుడ్‌న్యూస్‌ను అందించింది. ఆపిల్‌ యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తెచ్చింది. ఇకపై వాట్సాప్‌ ఐవోఎస్‌ నుంచి ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు చాట్‌ బదిలీ చేసే ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ నెల ప్రారంభంలో శాంసంగ్‌ అన్‌ప్యాక్ట్‌ 2021 ఈవెంట్‌లో తొలి సారిగా ఐఫోన్‌ టూ ఆండ్రాయిడ్‌ వాట్సాప్‌ చాట్‌ బదిలీ ఫీచర్‌ను ప్రకటించింది.

డబ్ల్యూఏబెటాఇన్ఫో ప్రకారం ఎంపిక చేయబడిన ఆపిల్‌ ఐవోఎస్‌ ఫోన్లకు అందుబాటులో  ఉందని వెల్లడించింది. ఐవోఎస్‌ వెర్షన్ 2.21.160.16 వాడుతున్న యూజర్లకు  వాట్సాప్‌ చాట్‌ ఫీచర్‌ బదిలీ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులో లేదు. ఐఫోన్‌లో వాట్సాప్‌ వెర్షన్‌ 2.21.160.16 వాడుతున్న  వారికి వాట్సాప్‌ యాప్‌ సెట్టింగ్స్‌లో ‘ట్రాన్సఫర్‌ టూ ఆండ్రాయిడ్‌’ అనే ఫీచర్‌ కన్పిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌తో శాంసంగ్‌ కంపెనీకి చెందిన మొబైల్‌ ఫోన్లకు మాత్రమే చాట్‌ బదిలీ ఫీచర్‌ అందుబాటులో ఉంది. (చదవండి: ఐమాక్స్‌ వీడియో రికార్డింగ్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ సొంతం...!)

త్వరలోనే ఇతర కంపెనీ స్మార్ట్‌ఫోన్లకు అందుబాటులో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌ చాట్‌లను బదిలీ చేసుకోవడానికి dr.fone వంటి థర్డ్‌పార్టీ యాప్స్‌ అందుబాటులో ఉండేవి. అంతేకాకుండా ఈ సర్వీస్‌ను ఉపయోగించుకోవాలంటే కొంత అమౌంట్‌ను వెచ్చించాల్సి ఉంటుంది. ఈ యాప్‌ థర్డ్‌పార్టీది కావడంతో యూజర్లకు భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. (చదవండి: కెమెరా ఇన్నోవేషన్‌ ల్యాబ్‌కు వేదికానున్న హైదరాబాద్‌)

మరిన్ని వార్తలు