WhatsApp 3D Avatar: వాట్సాప్‌ అవతార్‌ వచ్చేసింది..మీరూ కస్టమైజ్‌ చేసుకోండి ఇలా!

7 Dec, 2022 17:19 IST|Sakshi

న్యూఢిల్లీ: మెటా-యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌ మరోకొత్త ఫీచర్‌ను బుధవారం లాంచ్‌ చేసింది. యూజర్లు తమ  ప్రొఫైల్‌ను డిజిటల్ వెర్షన్‌లో రూపొందించుకునే ఈ ఫీచర్‌ అనుమతినిస్తుంది. నచ్చిన రీతిలో విభిన్న హెయిర్ స్టైల్స్, ఫేషియల్ ఫీచర్స్‌ను  క్రియేట్‌ చేసుకోవచ్చు. రకరకాల ఫీలింగ్స్‌, మీ మూడ్‌కనుగుణంగా   36 అనుకూల స్టిక్కర్‌లతో  మీ ఓన్‌ అవతార్‌ను ఎంచుకోవచ్చు.

అవతార్ ఫీచర్‌ను వినియోగదారులందరికీ రోల్ అవుట్ చేస్తున్నట్లు వాట్సాప్ తాజాగా ప్రకటించింది.  36 స్టిక్కర్‌లలో అవతార్‌ను ప్రొఫైల్ చిత్రంగా, చాట్‌లలో స్టిక్కర్‌గా ఉపయోగించవచ్చు. అన్ని యాప్‌లలో మరిన్ని స్టైల్‌లు త్వరలో రానున్నాయి అంటూ ఫేస్‌బుక్‌ సీఈవో  మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో రాశారు. 

అవతార్‌ ఎలా క్రియేట్‌ చేసుకోవాలి
WhatsApp ఖాతాను  ఓపెన్‌ చేసి, సెట్టింగ్‌లకు వెళ్లండి
అవతార్  ఆప్షన్‌ క్లిక్ చేయండి.(సెట్టింగ్స్‌లో  అకౌంట్‌ ఆప్షన్‌  కింద అవతార్‌  ఫీచర్‌ అప్‌డేట్ అయిన తరువాత  మాత్రమే అవతార్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది.)
మీ అవతార్‌ను  మీకు నచ్చినట్టుగా కస్టమైజ్‌ చేసుకొని  ప్రొఫైల్ చిత్రంగా సెట్ చేసుకోవడమే...సింపుల్‌

>
మరిన్ని వార్తలు