WhatsApp Latest Feature: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. మీకోసం

27 Sep, 2022 12:30 IST|Sakshi

ప్రముఖ మెసేంజర్ యాప్ (Whatsapp) వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లతో అనతి కాలంలోనే కోట్లాది యూజర్లను సంపాదించుకున్న సంగతి తెలసిందే. ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీతో తమ వినియోగదారులకు సేవలందించడంలో తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది. తాజాగా ఈ యాప్‌లో మరో కొత్త ఫీచర్‌ని జతచేస్తోంది. యూజర్లకు బెస్ట్‌ కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఈ ఫీచర్‌ని వాట్సాప్‌ ప్రవేశపెడుతోంది. వాయిస్ కాలింగ్ కోసం కాల్ లింక్‌ల ఫీచర్‌ను విడుదల చేసింది. యూజర్లు కేవలం ఒక ట్యాప్‌లో వాట్సాప్ వాయిస్ కాల్ చేయవచ్చని తెలిపింది. 

 ఈ ఫీచర్ ఉపయోగించాలంటే, యూజర్లు కాల్స్ ట్యాబ్‌లో అందుబాటులో ఉన్న ‘కాల్ లింక్‌లు’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.  ఆ తర్వాత వీడియో లేదా ఆడియో కాల్ లింక్‌ను క్రియేట్ చేసుకుని వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈజీగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. కాల్ లింక్‌లను ఉపయోగించేందకు యూజర్లు వారి వాట్సాప్‌ యాప్‌ను లేటెస్ట్‌ వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది.

వాట్సాప్‌లో ఈ కాల్ లింక్‌ల ఫీచర్‌ను దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. మెటా సీఈఓ (Meta CEO) మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. 32 మంది వ్యక్తుల కోసం సేఫ్‌ ఎన్‌క్రిప్టెడ్ వీడియో కాలింగ్‌ను పరీక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్‌తో సహా ఇతర గ్రూప్ వీడియో కాలింగ్ ప్లాట్‌ఫాంలు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. 

చదవండి: ఒకటికి మించి బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్‌!

మరిన్ని వార్తలు