Whatsapp: చూస్తే వావ్‌ అనాల్సిందే, అదిరిపోనున్న వాట్సాప్‌ కొత్త ఫీచర్‌!

9 Jan, 2023 14:04 IST|Sakshi

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ యూజర్ ఇంటర్‌ఫేస్, గోప్యతను మెరుగుపరచడానికి అనేక కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. మెటా యాజమాన్యంలోని యాప్ గత సంవత్సరం యాండ్రాయిడ్‌ నుంచి ఐఓఎస్‌కి బదిలీ ఫీచర్‌ను విడుదల చేసింది. ఎప్పటికప్పుడు వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేస్తూ యూజర్లు అందించే సేవలు విషయంలో ఏ మాత్రం రాజీలేకుండా దూసుకుపోతోంది ఈ సంస్థ. ఇటీవల గూగుల్‌ డ్రైవ్‌( Google drive)పై ఆధారపడటాన్ని తొలగించే మరొక బదిలీ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.. యూజర్ల కోసం త్వరలో ఈ కొత్త ఫీచర్‌ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్త ఫీచర్‌
ఇది వినియోగదారులు వాట్సాప్‌ (WhatsApp) డేటాను చాట్ హిస్టరీతో సహా ఆండ్రాయిడ్‌ నుంచి ఆండ్రాయిడ్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు అనుమతిస్తుంది. యూజర్లు ఇప్పటి వరకు గూగుల్‌ డిస్క్ బ్యాకప్‌ని ఉపయోగించి వారి డేటాను బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొత్త అప్‌డేట్ థర్డ్-పార్టీ యాప్‌లపై ఆధారపడటాన్ని తొలగించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ డెవలపింగ్‌ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ ద్వారా యూజర్లు తమ ఛాట్‌ హిస్టరీని ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది.

చదవండి: సామన్యులకు అలర్ట్‌: కొత్తగా మారిన రూల్స్‌ తెలుసుకోవడం తప్పనిసరి!

మరిన్ని వార్తలు