WhatsApp: ఫీచర్లు లీక్‌, వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌!

23 Sep, 2021 12:21 IST|Sakshi

యూజర్లకు వాట్సాప్‌ గుడ్‌ న్యూస్‌. వాట్సాప్‌లో మనీ ట్రాన్స్‌ ఫర్‌ చేసిన యూజర్లకు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వాట్సాప్‌  ఓ ఫీచర్‌పై వర్క్‌ చేస్తుండగా.. ఆ ఫీచర్లు లీకయ్యాయి.  

వాట్సాప్‌ బీటా ఇన్ఫో ప్రకారం.. ఇటీవల తెచ్చిన వాట్సాప్‌ పేమెంట్‌ ఆప్షన్‌ను యూజర్లు వినియోగించేలా వాట్సాప్‌ కొత్త అప్‌ డేట్‌లను అందుబాటులోకి తెస్తోంది. వాట్సాప్‌ త్రూ మనీ​ ట్రాన్స్‌ఫర్‌ చేసిన యూజర్లుకు క్యాష్‌ బ్యాంక్‌ ఆఫర్లను అందిస్తోంది.ఫోన్‌ పే, పేటీఎం తరహాలో యూపీఐ ద్వారా  వాట్సాప్‌ నుంచి మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసిన వినియోగదారులకు 'క్యాష్‌బ్యాక్‌' అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొని రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ డెవలప్‌ చేసే పనిలో వాట్సాప్‌ ప్రతినిధులు ఉండగా.. ఆ ఫీచర్లు లీక్‌ అయ్యాయి. 

227 రకాల బ్యాంక్‌ అకౌంట్లకు.. 
వాట్సాప్‌ ఇటీవల వాట్సప్‌ నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్పీసీఐ) భాగస్వామయ్యంలో వాట్సాప్‌ పేమెంట్‌ ఆప్షన్‌ను ఇండియన్‌ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆప్షన్‌ ను వినియోగించి యూజర్లు వాట్సాప్‌ ద్వారా 227 రకాల బ్యాంకు అకౌంట్లకు మనీ ట్రాన్స్‌ ఫర్‌ చేసుకోవచ్చని వాట్సాప్‌పేమెంట్‌ డైరక్టర్‌ మనేష్ మహాత్మే వెల్లడించారు.

చదవండి: వాట్సాప్‌లో మనీ ట్రాన్స్‌ఫర్‌ ఇలా చేయండి..

మరిన్ని వార్తలు