సేవల అంతరాయం: ప్రభుత్వానికి వాట్సాప్‌ వివరణ, గోప్యంగా వివరాలు!

29 Oct, 2022 11:59 IST|Sakshi

దేశవ్యాప్తంగా వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడడంపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో వాట్సాప్ ప్రభుత్వానికి వివరణాత్మక నివేదికను సమర్పించింది.
 

నివేదికలో ఏముంది!
భారత్‌ సహా పలు దేశాల్లో అక్టోబర్‌ 25న వాట్సాప్‌ సేవలు దాదాపు 2 గంటల పాటు నిలిచిపాయాయి. అయితే  కొంత సమయం తర్వాత ఆ సమస్య పరిష్కారమైంది. వాట్సాప్‌ సేవలు అంతరాయం లాంటి ఘటనలు ఇది వరకే పలుమార్లు చోటుచేసుకున్నప్పటికీ, ఈ స్థాయిలో సమస్య తలెత్తడం ఇదే తొలిసారి. దీంతో భారత ప్రభుత్వం దీనిపై నజర్‌ అయ్యింది. భారత్‌కు చెందిన కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (Cert-in)తో సమన్వయం చేసుకుంటూ అంతరాయానికి గల కారణాలను అన్వేషించాలని సూచించింది. సాంకేతిక సమస్య కారణమా లేక సైబర్‌ అటాక్‌ జరిగిందా అనేది చెప్పాలని కోరింది. కాగా వాట్సాప్‌కు భారత్‌లో 50 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు.

నివేదికల ప్రకారం.. వాట్సాప్ అంతరాయానికి సంబంధించిన రిపోర్ట్‌ను మెటా ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించింది. అందులో ఈ అంతరాయం గురించి సవివరమైన నివేదిక ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, వాట్సాప్ సమర్పించిన వివరణాత్మక నివేదికలోని వివరాలు ఇంకా బయటకు విడుదల కాలేదు. దీంతో వాట్సాప్‌ నివేదికపై స్పష్టమైన వివరాలు తెలియాల్సి ఉంది.

చదవండి: బంగారమా? ఇల్లా? పెట్టుబడికి ఏది బెటర్‌? ఈ విషయాలు తెలుసుకోండి!

మరిన్ని వార్తలు