నాలుగు బ్యాంకులతో వాట్సాప్ ఒప్పందం

16 Dec, 2020 17:31 IST|Sakshi

వాట్సప్ పేమెంట్స్ కి గతంలో భారత ప్రభుత్వం ఆమోదించిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం దేశంలో రెండు కోట్ల మందికి వాట్సాప్ పేమెంట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వాట్సాప్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని కంపెనీ స్వయంగా ప్రకటించింది. వాట్సప్ పేమెంట్ కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పిసిఐ)కి చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యుపిఐ) సిస్టమ్ యూజర్లకు అందుబాటులోకి ఉందని కంపెనీ తెలిపింది.(చదవండి: 437 కోట్లు కాదు.. రూ.52 కోట్లు నష్టం!)

సందేశాన్ని సురక్షితంగా పంపినంత తేలికగా డబ్బులను పంపించుకోవచ్చు. డబ్బు చెల్లింపుల కోసం స్థానిక బ్యాంకులకు వెళ్లకుండా సులభంగా డబ్బులను పంపవచ్చని సంస్థ తెలిపింది. సులభంగా, సురక్షితంగా డబ్బులను పంపించుకోవడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ.యాక్సిస్ బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నాం. డిజిటల్ ఎకానమీ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లాంటి లాభాలను ఎక్కువ మందికి అందించేందుకు కృషి చేస్తున్నాం అని వాట్సప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ తెలిపారు.

160కి పైగా బ్యాంకులకు వాట్సప్‌ పేమెంట్స్ సపోర్ట్ చేస్తుంది అని అన్నారు. డిజిటల్ ఇండియాలో మేము భాగస్వామ్యం అయినందుకు సంతోషిస్తున్నాం అని అన్నారు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 12 కోట్ల మంది యూపీఐ యూజర్స్ ఉన్నారు. మొత్తం యూపీఐ యూజర్ల సంఖ్యలో ఇది 28 శాతం. ప్రతి నెల యుపీఐ లావాదేవీల సంఖ్య పెరుగుతుంది. తాజా గణాంకాల ప్రకారం 2020 నవంబర్‌లో 2.23 బిలియన్ లావాదేవీలు జరిగాయి. అక్టోబర్(2.07 బిలియన్) నెలలో జరిగిన లావాదేవీలతో పోలిస్తే 6.7 శాతం ఎక్కువ.

మరిన్ని వార్తలు