WhatsApp: మీరు ఆ ఫోన్‌లు వాడుతుంటే ఇకపై వాట్సాప్‌ పనిచేయదు

27 Sep, 2021 09:31 IST|Sakshi

యూజర్లకు వాట్సాప్‌ హెచ్చరికలు జారీ చేసింది. యూజర్లు వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 4.0 వినియోగిస్తున్నట్లైతే వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని తెలిపింది. లేదంటే అప్‌డేట్‌ చేయని స్మార్ట్‌ ఫోన్‌లలో వాట్సాప్‌ పనిచేయదని స్పష్టం చేసింది. వీటితో పాటు పలు పాత మోడల్‌ స్మార్ట్‌ ఫోన్‌లలో వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ 4.1 సపోర్ట్‌ చేయదని, అందుకే ఆఫోన్‌లలో వాట్సాప్‌ సేవల్ని నిలిపివేస్తున్నట్లు చెప్పింది. 

వాట్సాప్‌ ఫీచర్‌ లీకర్‌ వీ బీటా ఇన్ఫో ప్రకారం..కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లకు ఆకట్టుకునేందుకు వాట్సాప్‌ ప్రయత్నిస్తుంది.పనిలో పనిగా ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లలో మార్పులు చేస్తుంది. తాజాగా వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 4.0 ను అప్‌ డేట్‌ చేసింది. ప్రస్తుతం వాట్సాప్‌  ఆండ్రాయిడ్‌ వర్షన్‌ 4.0ను వినియోగిస్తున్న యూజర్లు ఆండ్రాయిండ్‌ వెర్షన్‌ 4.1కి అప్‌ డేట్‌ అవ్వాలని తెలిపింది.

అధికారిక సపోర్ట్ పేజీలో సైతం వాట్సాప్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్ 4.1 సపోర్ట్‌ చేస్తున్నట్లు పేర్కొంది. నవంబర్‌1,2021 నుంచి ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 4.0.4 ఉంటే వాట్సాప్‌ పనిచేయదని చెప్పింది. ఇక వాట్సాప్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ సపోర్ట్‌ చేయని స్మార్‌ఫోన్‌ల జాబితాలో ఆప్టిమస్ ఎల్ 3, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్‌ఐఐ, గెలాక్సీ కోర్, జెడ్‌టిఇ గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్, హువాయ్ అసెండ్ జి 740లు ఉన్నాయి. ఈ ఫోన్‌లలో లేటెస్ట్‌ వెర్షన్‌ అప్‌డేట్‌ కాదని వాట్సాప్‌ ప్రకటించింది.   

చదవండి: ఫీచర్లతో డబ్బులే డబ్బులు, వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌! 

మరిన్ని వార్తలు