Whatsapp Feature : ఫోన్‌ డెడ్‌ అయినా వినియోగించుకోవచ్చు

15 Jul, 2021 14:50 IST|Sakshi

వాట్సాప్‌ వినియోగదారులకు కోసం వాట్సాప్‌ మల్టీ డివైజ్‌ఆప్షన్‌ అందుబాటులోకి తెచ్చింది. గత కొంతకాలంగా యూజర్లు మల్టీ  డివైజ్‌ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేయాలంటూ వాట్సాప్‌కు రిక్వెస్ట్‌ చేశారు. దీంతో ఆ ఆప్షన్‌పై వర్క్‌ చేస్తున్న వాట్సాప్‌ యాజమాన్యం యూజర్లకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పింది. 

వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్‌ 'వాట్సాప్‌ బీటా' వివరాల ఆధారంగా.. వాట్సాప్‌ను వినియోగదారుడు తన ఫోన్‌తో పాటు మరో నాలుగు రకాల డివైజ్‌లలో వినియోగించుకోవచ్చు. వాట్సాప్‌ వినియోగంలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఫోన్‌ ఛార్జింగ్‌ దిగిపోయి డెడ్‌ అయినా మిగిలిన నాలుగు డివైజ్‌లలో వాట్సాప్‌ ఆన్‌లోనే ఉంటుంది. ఇది పూర్తి ఎండ్ టూ ఎండ్ స్క్రిప్ట్ తో సెక్యూరిటీ, ప్రైవసీని కలిగి ఉంటున్నట్లు పేర్కొంది. 

మల్టీ డివైజ్‌ ఫీచర్‌ను ఎలా వినియోగించాలి

ఈ మల్టీ డివైజ్‌ ఫీచర్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు కాబట్టి ప్రస‍్తుతం ఈ ఫీచర్‌ను వినియోగించడం అసాధ్యం. వాట్సాప్‌ బీటా బ్లాగ్‌ పోస్ట్‌లో ప్రస‍్తుతం మల్టీ డివైజ్‌ ఆప్షన్‌ను కొంతమంది యూజర్లకు మాత్రమే అనుమతిస్తూ టెస్ట్‌ ట్రయిల్స్‌ను నిర్వహిస్తున్నట్లు పోస్ట్‌లో పేర్కొంది. దానికి తోడు అదనంగా మరిన్ని ఫీచర్స్‌ను యాడ్స్‌ చేయాలని భావిస్తోంది. ఇక ఈ ఆప‍్షన్‌ను ఆండ్రాయిడ్ ,ఐఓఎస్ యూజర్లు పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస‍్తుందో క్లారిటీ ఇవ్వలేదు.    

      

>
మరిన్ని వార్తలు