వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. గూగుల్‌ మీట్‌ తరహాలో

27 May, 2023 19:59 IST|Sakshi

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా వీడియో కాల్స్‌ చేసే సమయంలో యూజర్లు వినియోగార్ధం స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.  

జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ తరహాలో వీడియో కాల్స్ చేస్తున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు వాట్సాప్‌ సైతం అదే తరహాలో ‘స్క్రీన్ షేరింగ్’ ఆప్షన్ తెచ్చేందుకు నిమగ్నమైంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌పై బీటా టెస్టర్లకు అందుబాటులో ఉందని, త్వరలో అందరికి పూర్తిస్థాయిలో వినియోగించేలా విడుదల కానుందని వాబీటా ఇన్ఫో వెల్లడించింది.

ఇక, స్క్రీన్‌ ఫీచర్‌ ముఖ్య ఉద్దేశం..యూజర్లు వీడియో కాల్‌ మాట్లాడే సమయంలో అదే కాల్‌ను ఇతరులకు షేర్‌ చేసేలా డెవెలప్‌ చేస్తోంది. స్క్రీన్ కింద కొత్తగా స్క్రీన్ షేరింగ్ బటన్ అందిస్తున్నది. ఈ బటన్ క్లిక్ చేస్తే సరి.. మీ ఫోన్ లో చేసేది ప్రతిదీ రికార్డు అవుతుంది. అవతలి వ్యక్తికి కూడా షేర్ అవుతుంది. అయితే ఇలా వీడియో కాలింగ్ రికార్డు చేయడానికి యూజర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి.
 

మరిన్ని వార్తలు