వావ్..వాట్సాప్‌లో అదిరిపోయే సూపర్ ఫీచర్లు..అవేంటో తెలుసా?

3 Nov, 2022 15:11 IST|Sakshi

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మార్కెట్‌లో కాంపిటీటర్‌లకు గట్టి పోటీ ఇస్తూ యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో అప్లికేషన్‌ను అప్‌డేట్‌ చేస్తూ వస్తోంది. తాజాగా ‘కమ్యూనిటీస్’ అనే ఫీచర్‌ను వాట్సాప్‌ సంస్థ వరల్డ్‌ వైడ్‌గా ఎనేబుల్‌ చేసింది. ఇదే విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. 

గతంలో వాట్సాప్‌ గ్రూప్‌ల నిర్వహణ కష్టంగా మారడంతో.. మార్క్‌ జుకర్‌ బర్గ్‌ కమ్యూనిటీస్ ఫీచర్‌పై వర్క్‌ చేశారు. కొద్ది నెలల క్రితం బీటా వెర్షన్‌లో విజయ వంతంగా ట్రయల్స్‌ నిర్వహించి..గురువారం రియల్‌ టైం యూజర్లు  వినియోగించేలా మార్కెట్‌కు పరిచయం చేశారు.

కమ్యూనికేట్ ఫీచర్‌ 
వాట్సాప్‌లో ఫ్యామిలీ, కాలేజీ, ఆఫీస్‌ ఇలా అనేక గ్రూప్‌లు ఉండేవి. అయితే ఇప్పుడు ఫ్యామిలీ గ్రూప్‌లో ఎన్ని గ్రూప్‌లు ఉంటే అన్నీ గ్రూప్‌లో ఒకే గ్రూప్‌ కింద యాడ్‌ చేసుకోవచ్చు. అలా గ్రూప్‌లో యాడ్‌ చేసుకొని.. ఆ గ్రూప్‌కు ఒక నేమ్‌ సెలక్ట్‌ చేసుకుంటే సరిపోతుంది. ఫ్యామిలీలో ఫ్యామిలీ గ్రూప్‌లు, కాలేజీ గ్రూప్‌లో కాలేజీ గ్రూప్‌లు.. ఇలా డివైడ్‌ అయిపోతాయి. అలా గ్రూపుల్ని డివైజ్‌ చేయడం వల్ల వాట్సాప్‌ వినియోగం సులభతరం అవుతుందని మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. 

ఈ కమ్యూనికేట్ ఫీచర్‌తో పాటు గ్రూప్‌ చాట్‌లో పోల్స్‌ క్రియేట్‌ చేయడం, ఒకే సారి 32 మంది సభ్యులకు గ్రూప్‌ వీడియో కాల్‌ చేయడం, గ్రూప్‌ వీడియో కాల్‌లో పాల్గొనే సభ్యుల సంఖ్యను డబుల్‌ చేసిపనట్లు వాట్సాప్‌ ప్రతినిధులు తెలిపారు.  

గ్రూప్‌లో సభ్యుల సంఖ్య ఎంతంటే 
వాట్సాప్‌ గతంలో గ్రూప్‌ సభ్యుల సంఖ్య 512 మంది వరకు చేరే సౌకర్యం ఉంది. తాజాగా ఆ సభ్యుల సంఖ్య 1,024కి పెంచింది. తద్వారా వ్యాపార వేత్తలు వారి క్లయింట్లకు పెద్ద సంఖ్యలో మెసేజ్‌ సెండ్‌ చేయడంతో పాటు వ్యాపార కార్యకలాపాల్ని మరింత వృద్ధి చేసుకోవచ్చు. గతేడాది 256 మంది సభ్యుల నుంచి 512కి పెంచింది. కాగా వాట్సాప్‌ కాంపిటీటర్‌ టెలిగ్రాంలో సుమారు 2లక్షల మంది సభ్యులు చేరవచ్చు. కానీ వాట్సాప్‌ తరహాలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ తరహాలో సెక్యూర్‌ లేదని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు