వాట్సాప్​లో మరో సరికొత్త ఫీచర్‌!

20 Jul, 2021 20:01 IST|Sakshi

కొద్దిరోజుల క్రితం కొత్తగా మల్టీ డివైజ్‌ సపోర్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. జాయిన్‌ గ్రూప్‌ కాల్స్‌ పేరుతో కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్ సాయంతో యూజర్స్ గ్రూప్‌ కాల్‌ మధ్యలో ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. సాధారణంగా మన మిత్రులు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా మనం ఇతర పని చేస్తున్నపుడు వాట్సాప్ గ్రూప్ కాల్ కట్ చేస్తాం. అయితే, అలాంటి సంధర్భంలో వారు ఇంకా మాట్లాడుతుంటే మధ్యలో గ్రూప్ కాల్ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండదు.

అందుకే, వాట్సాప్ కొత్తగా జాయిన్‌ గ్రూప్‌ కాల్స్‌ పేరుతో సరికొత్త ఫీచర్ తీసుకొనివచ్చింది. మన మిత్రులు లేదా కుటుంబ సభ్యులు గ్రూప్ కాల్ చేసిన సందర్భంలో మన పాల్గొనకుండా తర్వాత ఎప్పుడైనా జాయిన్ అవ్వొచ్చు. మీరు జాయిన్ కావాలంటే గ్రూప్ కాల్ మీద టాప్ చేస్తే మీకు జాయిన్, ఇగ్నోర్ అనే రెండు బటన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు కనుక మీరు జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు మధ్యలో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. దశల వారీగా ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు