-

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌..! యూజర్లకు కాస్త ఊరట..!

7 Sep, 2021 17:11 IST|Sakshi

ప్రముఖ సోషల్‌ మెసేజింగ్‌ వాట్సాప్‌ మరో సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసురానుంది. గతంలో ప్రవేశపెట్టిన ప్రైవసీ సెట్టింగ్‌ను తిరిగి యూజర్లకు అందుబాటులో రానుంది. చివరిసారిగా వాట్సాప్‌ను ఏ సమయంలో ఉపయోగించారో చూపించే లాస్ట్‌సీన్‌ సెట్టింగ్‌లో అప్‌డేట్‌ను తీసుకురానుంది. లాస్ట్‌సీన్‌ ఆప్షన్‌ ద్వారా యూజర్లకు సంబంధించిన ప్రతి ఒక్కరికి వాట్సాప్‌ ఆయా యూజర్‌ ఎప్పుడు వాడరనే విషయాన్ని రెసిపెంట్‌ కాంటాక్టులకు తెలియజేస్తుంది.
చదవండి: WhatsApp: 'మనీ హెయిస్ట్‌ సీజన్‌ 5' ఎమోజీలొస్తున్నాయ్‌


లాస్ట్‌సీన్‌ ఆప్షన్‌ ఎవరు చూడకుండా  ఉండడం కోసం ప్రైవసీ సెట్టింగ్‌లో ‘నోబడీ’, ఎవ్రీవన్‌, మై కాంటాక్ట్స్ అప్షన్స్‌ను ఎంచుకోవడం ద్వారా లాస్ట్‌సీన్‌ను ఇతర యూజర్ల నుంచి నియంత్రించుకోవచ్చును. తాజాగా వాట్సాప్‌ లాస్ట్‌సీన్‌ సెట్టింగ్‌లో మరో ఆప్షన్‌ త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. లాస్ట్‌సీన్‌ సెట్టింగ్‌లో భాగంగా ‘మై కాంటాక్ట్స్ ఎక్సప్ట్‌’ అనే ఆప్షన్‌ను వాట్సాప్‌ పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎంచుకున్న ఆయా కాంటాక్ట్‌లకు యూజర్ లాస్ట్‌సీన్‌ కన్పించదు.

ప్రస్తుతం ఈ సెట్టింగ్‌ను వాట్సాప్‌ కేవలం ఐవోస్‌ యూజర్లకోసం పరీక్షిస్తుండగా ఈ సెట్టింగ్‌ను త్వరలోనే ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం అందుబాటులోకి వస్తోందని డబ్ల్యూఏబెటాఇన్ఫో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సెట్టింగ్‌తో కొంతమంది లాస్ట్‌సీన్‌ ఆప్షన్‌ను పూర్తిగా ఆఫ్‌ చేయకుండా నచ్చిన వ్యక్తులకు కన్పించే విధంగా చేసుకోవడంతో యూజర్లకు కాస్త ఊరట కల్గనుంది. 
చదవండి: Microprocessor Chips: సొంత చిప్‌ ప్రకటనలు పాతవే.. ఇప్పటికైతే డిజైన్‌ వరకే?

మరిన్ని వార్తలు