వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌..

30 Sep, 2020 18:51 IST|Sakshi

ముంబై: కొత్త  ఫీచర్లను అందిస్తూ వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తున్న వాట్సాప్‌ తాజాగా సరికొత్త ఫీచర్లను అందించనున్నట్లు పేర్కొంది. మెరుగైన స్టోరేజీ  కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చామని, బీటా యూజర్ల కోసం న్యూ స్టోరేజ్‌ యూఐ ఫీచర్‌ను అందించనున్నట్లు తెలిపింది.  స్టోరేజీ మేనేజ్ మెంట్ కోసం  స్టోరేజీ సెక్షన్ ను వాట్సాప్ అప్ డేట్ చేసింది. కాగా సరికొత్త స్టోరేజీ ఆప్షన్ ద్వారా వినియోగదారులకు మోడ్రాన్ స్టోరేజీ బార్ కనిపిస్తుంది.

అంతే కాకుండా వాట్సాప్‌లో మీడియా ఫైల్స్, ఇతర ఫైల్స్ సైజు కూడా చూడవచ్చు. మరోవైపు ఫైల్స్‌ పాతవా, కొత్తవా అని రివ్యూ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో వినియోగదారులు అనవసర ఫైల్స్‌ను డిలీట్‌ చేయవచ్చు. మరోవైపు సరికొత్త వాట్సాప్ బీటా అప్ డేట్ వెర్షన్ 2.20.201.9 ఫీచర్ అందుబాటులోకి రానుంది. కాగా అప్‌డేట్‌ వర్షన్‌ వల్ల ఫోటోలు, వీడియోలు, ఫైల్‌లను షేర్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు సరికొత్త వర్షన్‌ అందుబాటులోకి రాగా, ఐఓఎస్ యూజర్లకు ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందో, వాట్సాప్‌ ఇంకా ప్రకటించలేదు. (చదవండి: వాట్సాప్‌ చాట్‌ హ్యాక్‌.. ఆరా తీస్తున్న పోలీసులు)

మరిన్ని వార్తలు