WhatsApp: మీరు ఆ ఫోన్‌లు వాడుతుంటే ఇకపై వాట్సాప్‌ పనిచేయదు

23 Oct, 2021 16:35 IST|Sakshi

త్వరలో ఆండ్రాయిడ్‌ ఫోన్ల నుంచి ఆపిల్‌ ఫోన్ల వరకు వాట్సాప్‌ పనిచేయడం ఆగిపోనుంది. ముఖ్యంగా నవంబర్‌ 1నుంచి ఆయా టెక్‌ సంస్థలు తయారు చేసిన 43 స్మార్ట్‌ ఫోన్‌లలో వాట్సాప్‌ పనిచేయదని వాట్సాప్‌ ప్రతినిధులు తెలిపారు. 

సుమారు 2బిలియన్లకు పైగా వినియోగదారులున్న వాట్సాప్‌ కొత్త కొత్త మార్పులు చేస్తుంది. ఫీచర్లను యాడ్‌ చేస్తుంది. అయితే వాట్సాప్‌ తెస్తున్న కొత్త అప్‌డేట్‌ లకు స్మార్ట్‌ ఫోన్‌లు సపోర్ట్‌ చేయడం లేదు. ఆ ఫోన్‌లలో వాట్సాప్‌ వినియోగం, లేదంటే వాట్సాప్‌ ఫీచర్లు పనిచేయాలంటే భారీ ఖర్చు చేయాల్సి ఉంది. అందుకే సపోర్ట్‌ చేయని ఫోన్‌లలో యాప్‌ సేవల్ని నిలిపివేసేందుకు వాట్సాప్‌ నిర్ణయం తీసుకుంది.  

ఆండ్రాయిడ్ OS 4.1..దానికంటే పై వెర్షన్, అలాగే iOS 10 అంతకంటే పెద్ద వెర్షన్ స్మార్ట్‌ఫోన్ ఉన్న వారు మాత్రమే వాట్సాప్‌ను ఉపయోగించడం సాధ్యం అవుతుంది. ఇక వాట్సాప్‌ పని చేయని ఫోన్‌ల జాబితాలో మీ ఫోన్లు ఉన్నాయేమో చెక్‌ చేసుకోవడం మంచిది. 

 ఐ ఫోన్:

ఐఫోన్ 6 ఎస్
ఐఫోన్ 6 ఎస్ ప్లస్
ఆపిల్ ఐ ఫోన్ ఎస్ఈ

హువావే

ఎస్సేండ్ G740
ఎస్సేండ్ D క్వాడ్ XL
ఎస్సేండ్ మాటే
ఎస్సేండ్ P1 S
ఎస్సేండ్ D2
ఎస్సేండ్ D1 క్వాడ్ XL.


శామ్‌ సంగ్‌:

శామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్
గెలాక్సీ SII
గెలాక్సీ ట్రెండ్ II
గెలాక్సీ ఎస్ 3 మినీ
గెలాక్సీ కోర్
గెలాక్సీ Xcover 2
గెలాక్సీ ఏస్ 2

ఎల్‌జీ..

ఎల్‌జీ లూసిడ్ 2
ఆప్టిమస్ L5 డ్యూయల్
ఆప్టిమస్ L4 II డ్యూయల్
ఆప్టిమస్ F3Q
ఆప్టిమస్ F7
ఆప్టిమస్ F5
ఆప్టిమస్ L3 II డ్యూయల్
ఆప్టిమస్ F5
ఆప్టిమస్ L5
ఆప్టిమస్ L5 II
ఆప్టిమస్ L3 II
ఆప్టిమస్ L7
ఆప్టిమస్ L7 II డ్యూయల్
ఆప్టిమస్ L7 II
ఆప్టిమస్ F6
ఆప్టిమస్ F3
ఆప్టిమస్ L4 II
ఆప్టిమస్ L2 II
ఆప్టిమస్ నైట్రో హెచ్‌డీ,4X హెచ్‌డీ

జెడ్‌డీటీ

జెడ్‌టీఈ గ్రాండ్ S ఫ్లెక్స్
గ్రాండ్ X క్వాడ్ V987
జెడ్‌టీఈ V956
గ్రాండ్ మెమో

మరిన్ని వార్తలు