WhatsApp:మీరు అనుకుంటే వాట్సాప్‌లో కనిపించకుండా చేయవచ్చు.!

19 Aug, 2021 15:22 IST|Sakshi

వాట్సాప్‌ తన  యూజర్ల కోసం ఎప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. యూజర్ల భద్రత విషయంలో వాట్సాప్‌ అసలు రాజీ పడదు. వాట్సాప్‌ తాజాగా యూజర్ల కోసం ఫోటో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాట్సాప్‌ చాట్‌లో మీరు అనుకుంటే మెసేజ్‌లు కన్పించకుండా చేయవచ్చును. ఔను మీరు విన్నది నిజమే..! వాట్సాప్‌ యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌లో పంపే మెసేజ్‌లను నిర్ధిష్ట చాట్‌లో కన్పించకుండా ఆయా సందేశాల కాలాన్ని మీరు నిర్ణయించవచ్చును. (చదవండి: తాలిబన్లపై కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్‌...!)

వాట్సాప్ తన డిస్‌ఆపియర్‌ మెసేజ్స్‌ ఫీచర్ కోసం కొత్త ఆప్షన్‌ని పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌లో భాగంగా  90 రోజుల తర్వాత ఒక నిర్దిష్ట చాట్‌లో ఆటోమేటిక్‌గా మెసేజ్‌లను డిలీట్ చేయడానికి యూజర్‌లను అనుమతిస్తుంది. అంతేకాకుండా 24 గంటల్లో మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా కనుమరుగయ్యే ఆప్షన్‌ను కూడా వాట్సాప్‌ పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ వాస్తవానికి గత ఏడాది నవంబర్‌లో డిస్‌ఆపియర్‌ మెసేజ్స్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టగా ఈ ఫీచర్‌లో భాగంగా యూజర్లు పంపిన మెసేజ్‌లు  ఏడు రోజుల వ్యవధి ముగిసిన తరువాత మాత్రమే మెసేజ్‌లను అదృశ్యమయ్యేలా చేయడానికి వాట్సాప్‌ యాప్‌ వీలు కల్సిస్తుంది.

వాట్సాప్‌ ట్రాకర్ WABetaInfo నివేదిక ప్రకారం  బీటా వెర్షన్ 2.21.17.16 ద్వారా 90 రోజుల తర్వాత చాట్‌లో మెసేజ్‌లు కన్పించకుండా ఉండే ఫీచర్‌ను WABetaInfo  స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేసింది. 90 డేస్‌తో పాటు 24గంటల్లో వాట్సాప్‌లో మెసేజ్‌లు కన్పించకుండా చేసే ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెస్తోన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను గత కొన్ని నెలలుగా ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, వాట్సాప్‌ వెబ్‌ యూజర్ల కోసం పరిక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఫీచర్‌లో ఒక చిన్న మెలిక ఉంది. వాట్సాప్‌ యూజర్‌ ఇతర రెసిపెంట్లకు పంపిన మెసేజ్‌లకు డిస్‌ఆప్పియర్‌ ఫీచర్‌తో మెసేజ్‌లు పంపినా...,రెసిపెంట్‌ ఆయా మెసేజ్‌ను వేరే ఇతర వాట్సాప్‌ యూజర్లకు ఫార్వర్డ్‌ చేస్తే మాత్రం యూజర్‌ పంపిన మెసేజ్‌ ఎప్పటికి రెసిపెంట్‌తోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల ప్రారంభంలో వాట్సాప్‌ తన యూజర్ల కోసం సరికొత్తగా వ్యూ వన్స్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.  ఈ ఫీచర్‌ యూజర్లను ఎంతగానో ఆకర్షించింది. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!)

మరిన్ని వార్తలు