వాట్సాప్‌లో గ్రూప్‌ కాల్స్‌కో రింగ్‌టోన్

23 Aug, 2020 11:15 IST|Sakshi

న్యూఢిల్లీ: అంద‌రితో ట‌చ్‌లో ఉండాలంటే సోష‌ల్ మీడియాను ఫాలో అవాల్సిందే. అయితే మిగ‌తావాటి పోటీని త‌ట్టుకుని నిల‌బడేందుకు వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వినియోగ‌దారుల‌కు కొత్త ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తెస్తూనే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే గ్రూప్ కాల్స్‌కు కొత్త రింగ్‌టోన్‌, యానిమేష‌న్ స్టిక్క‌ర్స్, కెమెరా ఐకాన్‌ను తిరిగి అందుబాటులోకి తేవ‌డం వంటి స‌దుపాయాల‌ను తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది వీటన్నంటినీ ప్ర‌స్తుతం కొత్త‌గా వ‌స్తున్న ఆండ్రాయిడ్ బీటా వ‌ర్ష‌న్‌ల‌లో ప‌రీక్షిస్తోంది. ఇందులో స్టిక్క‌ర్స్‌తో భావాలు ప‌లికించే వాళ్ల కోసం మ‌రిన్ని యానిమేష‌న్ స్టిక్క‌ర్స్‌ను తీసుకొచ్చింది. (ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు ధీటుగా ‘బిగ్రాఫి’)

వాయిస్ కాల్స్‌లో క్వాలిటీ పెంచే దిశ‌గా క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఇందులో కాల్స్ చేసుకునేట‌ప్పుడు బ‌ట‌న్ల‌ను కింద భాగంలో చూపించ‌నుంది. అలాగే కెమెరా షార్ట్‌క‌ట్ స‌దుపాయాన్ని తీసుకురానుంది. ఈ కొత్త ఫీచ‌ర్‌లో డాక్యుమెంట్లు, కెమెరా, ఫొటోలు, లొకేష‌న్‌, కాంటాక్ట్ షార్ట్‌కట్స్‌ను సులువుగా గుర్తించ‌వచ్చు. అలాగే వాట్సాప్‌లోని ఫైళ్ల‌ను సుల‌భంగా వెతికేందుకు వీలుగా అడ్వాన్స్‌డ్ సెర్చ్ ఫీచ‌ర్‌ను కూడా విడుద‌ల చేసింది. అయితే ఇవ‌న్నీ ఇంకా పూర్తిగా అందుబాటులోకి  రాలేదు. (వాట్సాప్​లో ఐదు కొత్త ఫీచర్స్)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా