డెస్క్ టాప్‌లోనూ వాయిస్, వీడియో కాల్స్‌

5 Mar, 2021 14:28 IST|Sakshi

వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా వాట్సాప్ తన వినియోగదారుల ఆకట్టుకోవడానికి మరో కొత్త ఫీచర్ తీసుకు వచ్చింది. వాయిస్, వీడియో కాల్స్‌ సౌకర్యాన్ని డెస్క్ టాప్‌ యాప్‌నకూ కలిపించినట్టు వాట్సాప్‌ గురువారం ప్రకటించింది. ఈ సౌకర్యాన్ని పొందాలంటే డెస్క్ టాప్‌/ల్యాప్‌ ట్యాప్‌తో పాటు మొబైల్‌ కూడా ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉండాలి. కస్టమర్లకు నమ్మదగిన, అత్యంత నాణ్యమైన అనుభూతి కలిపిస్తున్నట్టు వాట్సాప్‌ తెలిపింది. డెస్క్ టాప్‌ యాప్‌నకూ గ్రూప్‌ వాయిస్, వీడియో కాల్స్‌ను రానున్న రోజుల్లో అందుబాటులోకి తీసుకు రానున్నట్టు వివరించింది. ఏడాదిగా వాట్సాప్‌ కాల్స్‌ పెరుగుతున్నాయని, నూతన సంవత్సర వేడుక నాడు 140 కోట్ల వాయిస్, వీడియో కాల్స్‌ నమోదయ్యాయని వెల్లడించింది.

చదవండి:

భూమికి దగ్గరగా దూసుకెళ్లనున్న ఆస్టరాయిడ్

ఇండియా పోస్ట్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు