జియో ఫోన్ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త!

9 Jun, 2021 13:40 IST|Sakshi

జియో ఫోన్ లో ఇకపై వాట్సాప్ వాయిస్ కాల్స్ 

కొత్త ఫీచ‌ర్ ను ఎనేబుల్ చేసిన వాట్సాప్ 

జియోతో పాటు కైయోస్ వినియోగ‌దారుల‌కు స‌దుపాయం

సాక్షి, ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో ఫోన్‌ వినియోగ‌దారుల‌కు వాట్సాప్ శుభ‌వార్త చెప్పింది. ఇక‌పై జియో ఫోన్ల‌లో వాట్సాప్ ద్వారా వాయిస్‌ కాల్స్‌ చేసుకునే సౌక‌ర్యాన్ని అందుబాటులోకి  తీసుకొచ్చింది. అంతేకాదు ఇక‌పై కైయోస్ ఆపరేటింగ్ సిస్టం(ఓఎస్‌) మోబైల్ వినియోగ‌దారులు  కూడా వాయిస్ కాల్స్ మాట్లాడుకునేలా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్‌ను ఎనేబుల్ చేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. 

వాట్సాప్‌లోని వాయిస్ కాల్స్ అప్ డేట్ తో తాజా వెర్షన్ 2.2110.41 తో లభిస్తుంది.  కొత్తగా తెచ్చిన ఈ ఫీచ‌ర్ ను కైయోస్ ఓఎస్ లో వినియోగించుకోవాలంటే 512 ఎంబీ ర్యామ్ త‌ప్ప‌ని స‌రిగా ఉండాల‌ని వాట్సాప్ ప్ర‌తినిధులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న కైయోస్ ఓఎస్ ఆప‌రేటింగ్ సిస్ట్ ఉన్న ఫోన్లలో ఈ నోటిఫికేష‌న్ చూపిస్తుంది.  ఒకవేళ కైయోస్ ఓస్ వినియోగ‌దారులు ఈ ఫీచ‌ర్ ను వినియోగించుకోవాల‌నుకుంటే త‌ప్ప‌నిస‌రిగా అనుమ‌తి ఇవ్వాల్సి ఉంటుంది.  

వినియోగ‌దారులు త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో, స్నేహితుల‌తో మాట్లాడేందుకు గ‌తంలోకంటే ఇప్పుడు వాట్సాప్ మీద ఆదార‌ప‌డుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల అన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగ‌దారులు వాట్సాప్ ను వినియోగించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. ఇందులో భాగంగా కైయోస్ ఓఎస్ లో వాట్సాప్ కాల్స్ ఫీచ‌ర్ ను ఎనేబుల్ చేసిన‌ట్లు  వాట్సాప్ సీఓఓ  మ్యాట్‌ ఐడెమా తెలిపారు.

చ‌ద‌వండి : సింపుల్ ట్రిక్, వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడొచ్చు
 

మరిన్ని వార్తలు