వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌

28 Jan, 2021 15:29 IST|Sakshi

వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా వాట్సాప్ తన వినియోగదారుల భద్రత దృష్ట్యా మరో కొత్త ఫీచర్ తీసుకురాబోతుంది. వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ యాప్ లో లాగిన్ అవ్వడానికి ముందు వాట్సాప్ మరో సెక్యూరిటీని జోడించింది. వాట్సప్ యూజర్లు తమ వాట్సాప్ ఖాతాలను కంప్యూటర్‌కు లింక్ చేసే ముందు, వేలిముద్ర లేదా ఫేస్ ఐడిని ఉపయోగించి లాగిన్ కావాలని కొరనుంది.(చదవండి: ఫేస్‌‘బుక్‌’ నకిలీ ఖాతాలతో జర జాగ్రత్త!)

ఈ ఫీచర్ ద్వారా మీ వాట్సాప్ ఖాతాను ఇతరుల కంప్యూటర్‌కు లింక్ చేయకుండా అడ్డుకోనుంది. ఇక నుంచి మీరు వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ యాప్ కు  వాట్సాప్ ఖాతాకు లింక్ చేయడానికి ముందు ఫోన్‌లో ఫేస్ ఐడి లేదా ఫింగర్ ప్రింట్ ద్వారా అన్‌లాక్ చేయమని కోరిన తర్వాత యూజర్లు మీ ఫోన్ నుంచి QR కోడ్ స్కానర్‌ను స్కాన్ చేసి యాక్సెస్ చేయవచ్చు. యూజర్ మొబైల్ ఫోన్‌లో ఉన్న డేటాను రక్షించడం కోసం ఈ ఫీచర్ తీసుకొచ్చినట్లు వాట్సాప్ తెలిపింది. ప్రస్తుతం ఇది ఇంకా అభివృద్ది దశలో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

>
మరిన్ని వార్తలు