Whatsapp : వీడియో ఫీచర్స్‌లో మార్పులు.. అవేంటంటే !

4 Jul, 2021 12:45 IST|Sakshi

వీడియో షేరింగ్‌లో క్వాలిటీ ఆప్షన్‌

స్నాప్‌చాట్‌ తరహాలో డిసప్పియర్‌ ఆప్షన్‌

బెటా వెర్షన్‌ ప్రయోగదశలో ఉన్న కొత్త ఫీచర్లు 

త్వరలో యూజర్లకు అందుబాటులోకి కొత్త ఫీచర్లు 

యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండే సరికొత్త ఫీచర్లను అందుబాటులో తెచ్చేందుకు వాట్సప్‌ ప్రయత్నిస్తోంది. వాట్సప్‌ యూజర్లకు సరికొత్త అనుభూతి ఇచ్చే విధంగా నూతన ఫీచర్లు ఉండబోతున్నాయి. ముఖ్యంగా వీడియో, చాట్‌ కంటెంట్‌ విషయంలో ఈ మార్పులు ఉండబోతున్నాయి.

వీడియో క్వాలిటీ
ఫుల్‌ హెచ్‌డీ వీడియో రికార్డింగ్‌ ఎప్పుడో పాతపడిపోయింది. ఇప్పుడు 4కే, 8కే రిజల్యూషన్‌ వీడియో రికార్డింగ్‌ ట్రెండ్‌గా మారింది. అయితే 4కే , 8కే వీడియోలు ఎక్కువ మోమోరినీ ఆక్రమిస్తాయి. వీటిని  ఇతరులకు సెండ్‌ చేసేప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటుంది. మరోవైపు వీడియో డౌన్‌లోడ్లతో ఫోన్లలో మోమరీ సైతం త్వరగా అయిపోతుంది. ఈ రెండు సమస్యల పరిష్కారానికి వీడియో క్వాలిటీ షేరింగ్‌లో వాట్సప్‌ మార్పులు చేసింది. దీనికి సంబంధించి బీటా వెర్షన్‌ను ఆండ్రాయిడ్‌ ఫోన్లలో టెస్ట్‌ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే దీన్ని యూజర్లకు అందుబాటులోకి వాట్సప్‌ తేనుంది. 

కొత్త మార్పులు ఇలా
వాట్సప్‌ తాజా అప్‌డేట్ అయిన వీడియో షేరింగ్‌ క్వాలిటీకి సంబంధించి మూడు ఆప్షన్లు ఉంటాయి. ఇందులో ఒకటి ఆటో వెర్షన్‌ ఆప్షన్‌ , వాట్సప్‌ సైతం దీన్నే రికమండ్‌ చేయనుంది. బెస్ట్‌ క్వాలిటీ వీడియో, డేటా సేవ్‌లు మరో రెండు ఆప్షన్లు ఉంటాయి. ఆటో వెర్షన్‌ని ఎంచుకుంటే సెండ్‌ చేసే వీడియోకు సంబంధించి బెస్ట్‌ ఆల్గోరిథమ్‌ని ఎంచుకుని దాని ప్రకారం వీడియోను వాట్సప్‌ సెండ్‌ చేస్తుంది. ఇక డేటా సేవ్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే... వీడియోను కంప్రెస్‌ చేసి పంపిస్తుంది. మూడవది బెస్ట్‌ క్వాలిటీ వీడియోస్‌ని పంపే వెసులుబాటు కల్పిస్తుంది. 

చూశాక.. మాయం
స్నాప్‌ చాట్‌ తరహాలోనే నిర్ణీత సమయం తర్వాత మేసేజ్‌, ఫోటోలు, వీడియోలు తదితర కంటెంట్‌ ఆటోమేటిక్‌ డిసప్పియర్‌  అయ్యేలా ఆప్షన్‌ను ప్రవేశపెట్టే పనిలో వాట​​‍్సప్‌ ఉంది. వాట​‍్సప్‌లో వచ్చిన కంటెంట్‌ను ఒకసారి చూసిన తర్వాత కొంత సమయానికి ఆ కంటెంట్‌ కనిపించకుండా పోతుంది. బిజినెస్‌ రిలేటెడ్‌ చాట్స్‌కి ఆ ఆప్షన్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వాట్సప్‌ అంటోంది. దీనికి సంబంధించి బీటా వెర్షన్‌ సైతం టెస్టింగ్‌లో  ఉంది. 
 

మరిన్ని వార్తలు