వాట్స‌ప్‌ యూజర్లకు షాక్.. ఇక ఆ ఫోన్లకు కొత్త ఫీచర్స్ నిలిపివేత!

8 Sep, 2021 20:43 IST|Sakshi

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకోస్తూ వినియోగ‌దారుల‌ను ఆశ్చ‌ర్య ప‌ర‌చ‌డం వాట్స‌ప్‌కు స‌హ‌జం. ఇటు ఆండ్రాయిడ్, అటు ఐఓఎస్ వినియోగ‌దారులకు కొత్త ఫీచ‌ర్ల‌ను అందించే వాట్స‌ప్‌ యూజర్లకు షాకింగ్ న్యూస్ తెలిపింది. న‌వంబ‌ర్ 1, 2021 నుంచి ప‌లు మోడ‌ళ్ల‌లో వాట్స‌ప్ కొత్త ఫీచర్స్ ప‌ని చేయవని పేర్కొంది. ఆండ్రాయిడ్ 4.0.3 లేదా అంతకంటే తక్కువ ఓఎస్ మీద రన్ అవుతున్న ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఓఎస్ 9 లేదా అంతకంటే తక్కువ రన్ అవుతున్న ఆపిల్ ఫోన్లలో వాట్స‌ప్‌ కొత్త ఫీచర్స్ ఇక పని చేయవు. 

ఈ పలు మోడ‌లళ్ల‌లో కొత్త ఫీచ‌ర్ అప్‌డేట్ చేయ‌డానికి వ‌ర్ష‌న్ స‌పోర్టు చేయ‌ద‌ని అందుకే వీటికి వాట్స‌ప్‌ కొత్త ఫీచర్స్ నిలివేస్తున్నట్లు పేర్కొంది. ఇది క్రమ క్రమంగా ఈ పాత స్మార్ట్ ఫోన్లపై వాట్స‌ప్‌ నిలిపివేసే అవకాశం ఉంది. యూజర్లకు మెరుగైన సదుపాయం అందించడం కోసం ఇలా చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. వాట్స‌ప్‌ విడుదల చేసిన ఆండ్రాయిడ్ ఫోన్ల జాబితాలో శామ్ సంగ్, ఎల్ జీ, జడ్ టీఈ, హువావే, సోనీ, అల్కాటెల్ వంటి తదితర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మరోవైపు ఐఫోన్ల జాబితాలో ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ఉన్నాయి.(చదవండి: భారత తొలి ఎలక్ట్రిక్‌ కారు ఇదేనండోయ్‌..!)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు