WhatsApp: వాట్సాప్‌లో కెప్ట్‌ మెసేజ్‌ ఫీచర్‌

16 Jan, 2023 20:29 IST|Sakshi

ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ ‘కెప్ట్‌ మెసేజ్‌’ అనే కొత్త ఫీచర్‌ని పరీక్షిస్తోంది. దీనితో డిజపీయరింగ్‌ మెసేజ్‌లను సేవ్‌ చేయవచ్చు. 

చాట్‌లకు సంబంధించి మరింత కంట్రోల్‌కు యూజర్‌లకు ఉపకరించే ఫీచర్‌ ఇది. 2021లో స్నాప్‌చాట్‌... మొదలైన వాటి స్ఫూర్తితో వాట్సాప్‌ ‘డిజప్పియరింగ్‌ మెసేజ్‌’ ఫీచర్‌ను ప్రవేశ పెట్టింది. ఎవరికైనా మెసేజ్‌ పంపినప్పుడు నిర్ణీతమైన కాలవ్యవధి తరువాత మెసేజ్‌ దానికదే డిలీట్‌ అయిపోతుంది. మళ్లీ దాన్ని చూడడం కుదరదు. 

అయితే ‘కెప్ట్‌ మెసేజ్‌’ టూల్‌ డిజప్పియరింగ్‌ చాట్‌లో కూడా మెసేజ్‌లను ప్రిజర్వ్‌ చేస్తుంది. (క్లిక్‌ చేయండి: ఇన్‌స్టాలో డిలీట్‌ చేసిన కంటెంట్‌ను రీస్టోర్‌ చేసుకోవడానికి...)

మరిన్ని వార్తలు