Best gaming TVs: బెస్ట్‌ గేమింగ్‌ టీవీ కోసం చూస్తున్నారా, ఇదిగో కళ్లు చెదిరే టీవీల లిస్ట్‌

11 Aug, 2022 12:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఈ ఫెస్టివ్‌  సీజన్‌లో మంచి గేమింగ్‌ టెలివిజన్‌  కొనుగోలు చేయాలని చూస్తున్నారా. ఇటీవలి  కాలంలో మొబైల్స్‌, టీవీల్లో గేమింగ్  బాగా పాపులర్‌ అవుతోంది. తమ  స్నేహితులతో కలిసి  వర్చువల్‌గా మల్టీప్లేయర్ గేమ్స్‌తో కొత్త ప్రపంచాలని అన్వేషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో  అద్భుతమైన మానిటర్ లేదా టీవీ  చాలా ముఖ్యం.  

గేమింగ్‌ టీవీలు  అధిక రిఫ్రెష్ రేట్ 4K డిస్‌ప్లేలు గేమ్‌లలో అద్భుతమైన విజువల్స్‌ను  ఫిక్స్‌డ్‌ ఫ్రేమ్ రేట్‌తో అందిస్తాయి. ఈ టీవీలు శక్తివంతమైన ప్రాసెసర్‌లతో  పాటు,  VRR, G-Sync,  FreeSync కి  సపోర్ట్‌తో కస్టమర్లకు మంచి గేమింగ్‌ అనుభవాన్నిస్తాయి.  ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నదిగ్గజ కంపెనీలుఎల్‌జీ, సోనీ, శాంసంగ్‌ , టీసీఎల్‌ తదితర  ది బెస్ట్‌ టీవీలను ఒకసారి చూద్దాం

ఎల్‌జీ సీ 2

ఎల్‌జీ సీ 2 OLED 4K స్మార్ట్ టీవీ C1కి సక్సెసర్ ఇది. α9 Gen5 AI ప్రాసెసర్‌తో వస్తుంది, 42, 48, 55 ,65,77 , 83 అంగుళాల సైజుల్లో లభ్యం. ఇది పిక్సెల్ డిమ్మింగ్‌కు మద్దతు ఇస్తుంది . 100 శాతం కలర్‌ ఫిడెలిటీతో   మంచి గేమింగ్‌ అనుభవాన్నిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో Nvidia G-Sync, AMD ఫ్రీసింక్ ,  VRRలకు  సపోర్ట్‌ దీని స్పెషాలిటీ. ఇది పీసీగానూ కన్సోల్ గేమింగ్‌కు  పనికొస్తుంది. ఇండియాలో ఈ టీవీ ధర  రూ. 1,39,990 నుండి ప్రారంభం. LG అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


సోనీ X90J


కంపెనీ  ఫ్లాగ్‌షిప్ 4K LED స్మార్ట్ టీవీఇది.   సోనీ X90J అనేది  బ్యాక్‌లైటింగ్ లోకల్ డిమ్మింగ్‌తో  గేమింగ్‌కోసం బెస్ట్‌ ఆప్షన్‌ ఇది.  ఇమేజ్ క్వాలిటీని పెంపొందించే Bravia XR ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌  VRRకి  సపోర్టు చేస్తుంది. ఇందులోని  ఫార్-ఫీల్డ్ మైక్స్‌తో  మీ వాయిస్‌ని ఉపయోగించి ఆపరేట్ చేస్తూ ఎంజాయ్‌ చేయొచ్చు.  55,  65 అంగుళాల స్క్రీన్ సైజులలో లభిస్తుంది  భారతదేశంలో రూ. 1,18,740 నుండి ప్రారంభం. ఈ టీవీని క్రోమా ద్వారా కొనుగోలు చేయవచ్చు.


శాంసంగ్‌ Q90B QLED TV 


అద్భుతమైన 4K చిత్రాలను అందించడానికి నియో క్వాంటం ప్రాసెసర్‌ని కలిగి ఉంది. క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ లైట్‌ని ఎడ్జస్ట్‌ చేసుకుని,  4K గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే ఈ టీవీకి VRR మద్దతు లేదు. 50, 55, 65, 75, 85 అంగుళాలలో అందుబాటులో ఉంది. ధర రూ. 1,09,990 నుండి ప్రారంభం Samsung అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


TCL C835 4K TV 

క్వాడ్-కోర్ 4K ప్రాసెసర్‌,  లోకల్ డిమ్మింగ్ , 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో ఈ టీవీ వస్తుంది.  మినీ LED ప్యానెల్  అద్భుతమైన కాంట్రాస్ట్‌,  VRR మద్దతును దీని స్పెషల్‌. TCL C835 TV 55,65 ,75 అంగుళాలలో అందుబాటులో ఉంది.  ధర భారతదేశంలో రూ. 1,19,990 నుండి ప్రారంభం.  TCL స్టోర్, క్రోమా, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్‌ ది ఫ్రేమ్ 2022
శాంసంగ్‌ నుంచి మరో సూపర్‌  గేమింగ్ టీవీ శాంసంగ్‌ ది ఫ్రేమ్ 2022అద్భుతమైన  డిజైన్‌తో అధునాతన ఫోటో ఫ్రేమ్‌గా కనిపిస్తుందీ టీవీ.120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌తో ఫ్రేమ్ 100 శాతం కలర్ వాల్యూమ్‌ను అందించే క్వాంటం డాట్ టెక్‌, క్వాంటం ప్రాసెసర్‌ కలిగి ఉంది. భారతదేశంలో రూ. 53,990 నుండి ప్రారంభ​​ం, దీన్ని Samsung స్టోర్, అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు


 

మరిన్ని వార్తలు