వాట్సాప్ vs టెలిగ్రామ్: ఏది సేఫ్?

3 Dec, 2020 16:38 IST|Sakshi

గతంలో ఒక వివాదాస్పద చట్టాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది నిరసనకారులు హాంగ్ కాంగ్ వీధుల్లోకి వచ్చి తమ నిరసన తెలియజేసారు. ఇంత పెద్ద మొత్తంలో నాయకత్వం లేకుండా వారు నిరసన తెలియాజేయడానికి వారి ప్రధాన ప్రచార సాధనం టెలిగ్రామ్. అవును, వారు నిరసనలను నిర్వహించడానికి చాలా మంది టెలిగ్రామ్ లో సమావేశమయ్యారు. అందుకే ఇది ఇప్పటికి సురక్షితమైన కమ్యూనికేషన్ సాధనంగా ఉంది. ప్రపంచంలో ప్రైవేట్ లేదా ప్రభుత్వ పరిశీలనల(సెన్సార్‌షిప్) నుంచి తప్పించుకోవడానికి ఇష్టపడే ప్రజలు, నిరసనకారులు, ఉగ్రవాదులు టెలిగ్రామ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 2013లో నికోలాయ్ మరియు పావెల్ దురోవ్ చేత స్థాపించబడిన మెసేజింగ్ అప్లికేషన్ ద్వారా ఉచితంగా టెక్స్ట్ సందేశాలు, ఫోటోలు, వీడియోలు, పత్రాలు, ఇతర ఫైళ్ళను సులభంగా పంపించుకోవచ్చు. టెలిగ్రామ్ ప్రస్తుత ప్రధాన కార్యాలయం దుబాయ్‌లో ఉంది. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ గల వాట్సాప్ యాప్ ఇటీవల హ్యాకింగ్ గురి అయిన తర్వాత చాల మంది టెలిగ్రామ్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. (చదవండి: రికార్డు సృష్టించిన ఫౌజీ గేమ్)

వాట్సాప్ లేదా టెలిగ్రామ్: అత్యంత సురక్షితమైన యాప్ ఏది?
వాట్సాప్ లో ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ ని టెలిగ్రామ్ కూడా అందిస్తుంది. ఒకే సమయంలో ఒకే ఖాతాతో వేర్వేరు పరికరాలలో వాట్సాప్ తో పోలిస్తే సురక్షితంగా లాగిన్ కావచ్చు. టెలిగ్రామ్ లో రహస్యంగా చాట్ చేసుకోవచ్చు. క్లౌడ్ స్టోరేజ్ నియమాలకు విరుద్దంగా రహస్య చాట్ యొక్క డేటా లోకల్ స్టోరేజ్ లలో నిల్వ చేయబడుతాయి. అలాగే, టెలిగ్రామ్‌లో స్నాప్‌చాట్‌లో లాగా సందేశాలను వాటంతట అవే డిలేట్ అయ్యే విదంగా మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇందులో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ లేనప్పటికీ సీక్రెట్ చాట్ చేసుకోవడం ద్వారా ఇతరులకు సమాచారం తెలియదు. టెలిగ్రామ్ MTProto అని పిలువబడే దాని స్వంత యాజమాన్య ప్రోటోకాల్‌ను ఉపయోగిస్తుంది. వినియోగదారులు డేటాను టెలిగ్రామ్‌ విక్రయించదు కాబట్టి దానిని విశ్వసించవచ్చు అని నిపుణులు తెలిపారు. 

వినియోగదారులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లినప్పుడు హ్యాకర్లు వీరిని గుర్తించడం కొంచెం కష్ట్టమని నిపుణులు తెలిపారు. దీనిలో టెలిగ్రామ్ ఉన్న 'రహస్య చాట్' ఫీచర్ అనేది ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ లాగా పనిచేస్తుంది. మీరు 'రహస్య చాట్' మీరు నిర్దేశించిన తర్వాత ఆటోమేటిక్ గా మీ డేటా డిలీట్ చేయబడుతాయి. వీటిని తిరిగి పొందడం అసాధ్యం. వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి సందేశాలను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయకూడదని టెలిగ్రామ్ నిర్ణయించుకుంది. రహస్య చాట్‌లు అనేవి యూజర్ల ఇష్టానికి సంబంధించింది అని పేర్కొంది. 

వాట్సాప్ ప్రకటన దారుల కోసం యూజర్ల వ్యక్తిగత డేటాని పొందటానికి అనుమతించినట్లు టెలిగ్రామ్ చేయదని పేర్కొంది. టెలిగ్రామ్ ఆదాయం కోసం వినియోగదారు విరాళాలు సేకరిస్తాం అని తెలిపింది. "లాభాలను సంపాదించడం టెలిగ్రామ్‌కు అంతిమ లక్ష్యం కాదు" అని టెలిగ్రామ్ పేర్కొంది. అన్ని యాప్ ల మాదిరిగానే యూజర్ల డేటా నిల్వ కోసం క్లౌడ్ స్టోరేజీను ఎంచుకుంది. ఎవరైనా హ్యాకర్లు క్లౌడ్ స్టోరేజీపై నియంత్రణ సాధిస్తే సీక్రెట్ చాట్ తప్ప అన్ని సందేశాలు హ్యాకింగ్ గురి అవుతాయి.   

ఉగ్రవాద దాడులను ప్లాన్ చేసే ఉగ్రవాదులకు మంచి సమన్వయ సాధనంగా టెలిగ్రామ్ వార్తల్లో ఉంది. టెలిగ్రామ్ ఛానెల్స్ లో ఎక్కువగా చలనచిత్ర, టీవీకి సంబదించిన పైరసీ చిత్రాలను షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కానీ ఈ సమస్యలను పరిష్కరించడానికి సంస్థ కృషి చేస్తోంది అని సంస్థ నిర్వహకులు తెలిపారు. "టెలిగ్రామ్ హింస, నేర కార్యకలాపాలు మరియు దుర్వినియోగదారులకు చోటు కాదు" అని టెలిగ్రామ్ తెలిపింది. టెలిగ్రామ్ విశ్వసనీయమైనది, వేగవంతమైనది, సురక్షితమైనది మనకు ఐఫోన్లు ఎంత సురక్షితంగా భావిస్తామో అంత సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. ఇది రహస్యంగా పనిచేసే జర్నలిస్టులకు సురక్షితమైన సమాచార సాధనంగా ఉపయోగపడుతుంది. ప్రపంచ శాంతి సంస్థ ఐక్యరాజ్యసమితి కూడా తన అధికారులను తమ ఫోన్ల నుంచి వాట్సాప్ ను డిలీట్ చేయాల్సిందిగా కోరింది అంటే మనం అర్ధం చేసుకోవచ్చు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా