‘పాపం..చేప! నా బాధ వారికే తెలుస్తుంది’ ఎయిరిండియాపై పెట్‌ లవర్‌ ఫిర్యాదు వైరల్‌

28 Mar, 2023 15:26 IST|Sakshi

బెంగళూరు: టాటా యాజమాన్యంలోని ఎయిరిండియాపై ఒక వ్యక్తి ఫిర్యాదు వార్తల్లో నిలిచింది. నా పెంపుడు ఫిష్‌ను విమానంలో తీసుకెళ్లనీయ లేదంటూ బెంగళూరుకు చెందిన హుస్సేన్ ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను స్వయంగా   హుస్సేన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీంతో  ఈ చేప కథ వైరల్‌గా మారింది.

డిజిటల్ మార్కెటర్ అకిబ్ హుస్సేన్ బెంగళూరు నుండి శ్రీనగర్‌కు ఎయిరిండియా విమానంలో బయలుదేరారు. అత్యవసర విమానంలో హుస్సేన్ తన తల్లిని చూడటానికి వెళుతున్నారు. అయితే తనతోపాటు పెట్‌ ఫిష్‌ కంటైనర్‌ను తీసుకెళ్లడంపై సిబ్బంది అభ్యంతరం  చెప్పారు. అందులోని నీరు పరిమితికి మించి ఉందంటూ  దాన్ని క్యారీచేసేందుకు అనుమతినివ్వలేదు ఎయిర్‌లైన్.  దీంతో తన లైఫ్‌లో ఇదో ‘‘చెత్త అనుభవం’’ అంటూ ఎయిరిండియా, టాటా సన్స్ ఎమెరిటస్ ఛైర్మన్ రతన్ టాటాలను ట్యాగ్ చేస్తూ ట్వీట్‌ చేశారు. (ఇండియన్‌ టెకీలకు గిట్‌హబ్‌ షాక్‌: టీం మొత్తానికి ఉద్వాసన)

ఈ వివరాలను వరుస ట్వీట్లలో షేర్‌ చేసిన హుస్సేన్‌ “ఒక పెట్‌ లవర్‌ బాధ మరో పెట్‌ లవర్‌కు మాత్రమే అర్థం అవుతుంది.  కేవలం 50 గా బరువున్న ట్రాన్స్‌పరెంట్‌  కంటైనర్‌లో లైవ్ అక్వేరియం తీసుకెళ్లేందుకు బెంగళూరుకు చెందిన ఫ్లైట్ గ్రౌండ్ స్టాఫ్,  ఫ్లైట్ ఎక్కనీయలేదు.  క్యారీరింగ్ ఛార్జీగా రూ.1,350 జరిమానా చెల్లించేందుకు సిద్ధపడినా అంగీకరించలేదు. దీనిపై చర్య తీసుకొనేది ఎవరంటూ వాపోయాడు.  సంవత్సరం పాటు కలిసి బతికాం.. కానీ ఎయిరిండియా కారణంగా బలవంతంగా విమానాశ్రయంలో వదిలివేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు ఎయిర్‌పోర్ట్‌లో వదిలివేసిన హుస్సేన్ పెంపుడు చేపను ఎయిర్‌లైన్ ఉద్యోగులు బెంగళూరులోని అతని బంధువుకు సురక్షితంగా అప్పగించారుట. (Disney Layoffs: మరో నాలుగు రోజులే, ఉద్యోగులకు ఈమెయిల్‌ బాంబు!)

>
మరిన్ని వార్తలు