యూట్యూబ్‌ సీఈవోగా భారతీయుడు.. అసలు ఎవరీ నీల్‌ మోహన్‌!

18 Feb, 2023 13:48 IST|Sakshi

అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలకు సారథ్యం వహించే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో టెక్నాలజీ కంపెనీ సారథ్య బాధ్యతలను భారత సంతతికి చెందిన వ్యక్తి దక్కించుకున్నారు. వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌కు సీఈవోగా నీల్‌ మోహన్‌ (47) నియమితులయ్యారు. దీంతో నీల్‌ మోహన్‌ సైతం ఇతర టెక్‌ కంపెనీల్లో సీఈవోలుగా విధులు నిర్వహిస్తున్న భారతీయుల జాబితాలో స్థానాన్ని సంపాదించుకున్నారు. 

ఆయన నియామకంతో యూట్యూబ్‌కి సుదీర్ఘ కాలంగా.. సీఈవోగా ఉన్న సూసన్ వొజిసికి తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తన బ్లాగ్ పోస్టులో పేర్కొన్నారు.  తొమ్మిదేళ్ల క్రితం తాను యూట్యూబ్లో చేరినప్పుడు అద్భుతమైన నాయక బృందాన్ని తీసుకురావాలనేది..తన మెుదటి ప్రాధాన్యమని..సూసన్  తెలిపారు. నీల్ మోహన్ అందులో ఒకరని వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్‌లో ఇంటర్‌ వరకు చదివిన నీల్‌ మోహన్‌..యూట్యూబ్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టే వరకు ఆయన ప్రస్తానం ఎలా సాగిందో తెలుసుకుందాం. 

►లక్నోకు చెందిన ఆదిత్యమోహన్‌, దీపా మొహన్‌ దంపతులకు నీల్‌ మొహన్‌ జన్మించారు. 

►ప్రాధమిక విద్య వరకు లక్నో స్థానిక స్కూల‍్లో చదివిన ఆయన ఇంటర్‌ హజ్రత్‌గంజ్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్‌ కాలేజీలో పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. 

►1996లో స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేశారు.

►గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసిన తర్వాత 1997లో యాక్సెంచర్‌లో, అదే ఏడాది నెట్‌ గ్రావిటీ అనే స్టార్టప్‌లో చేరారు. నెట్‌ గ్రావిటీలో ఆపరేషన్‌ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అక్కడే తాను ఉన్నత శిఖరాలకు చేరుకునేలా బీజం పడిందని నీల్‌ మొహన్‌ చెబుతారు.

►1997లోనే నెట్‌ గ్రావిటీని ప్రముఖ పెట్టుబడుల సంస్థ హెల్మాన్ & ఫ్రైడ్‌మెన్‌కు చెందిన డబుల్‌ క్లిక్‌ సంస్థ కొనుగులో చేసింది. ఈ  కొనుగోలుతో నీల్‌ మొహన్‌  న్యూయార్క్‌లో ఉన్న డబుల్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు షిఫ్ట్‌ అయ్యారు. అక్కడే  కొన్ని సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. 

►ముఖ్యంగా డాట్‌ కామ్‌ బుడగ పేలిన  సమయంలో ఆ గండం నుంచి గట్టేందుకు డబుల్‌ క్లిక్‌ సంస్థ నీల్‌ మోహన్‌పై ఆధారపడింది. అలా తన బిజినెస్‌ వ్యూహాలతో అదే సంస్థ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు.  

►2003లో ఎంబీఏ చదివేందుకు స్టాన్‌ఫోర్డ్‌కు తిరిగి వచ్చారు. స్టాన్‌ఫోర్డ్‌లో ఉన్నప్పుడు డబుల్‌ క్లిక్ సంస్థ 1999లో అబాకస్ డైరెక్ట్‌ను కొనుగోలు చేసింది.   

►ఆ తర్వాత జరిగిన పరిణామాలతో డబుల్‌ క్లిక్‌ను, అబాకస్‌ డైరెక్ట్‌ ఈ రెండు సంస్థల్ని విలీనం చేయాలనే హెల్మాన్ & ఫ్రైడ్‌మెన్‌ యాజమాన్యం ప్రతిపాదనల‍్ని వెనక్కి తీసుకుంది. 

►అదే సమయంలో హెల్మెన్‌  & ఫ్రైడ్‌మాన్ కంపెనీ విభజన నేపథ్యంలో డబుల్‌క్లిక్ దీర్ఘకాల సీఈవోగా డేవిడ్ రోసెన్‌బ్లాట్‌ను నియమించింది. 

►డబుల్‌ క్లిక్‌ సీఈవోగా రోసెన్‌బ్లాట్ విధులు నిర్వహించే సమయంలో నీల్‌ మోహన్ ఎంబీఏ పూర్తి చేశారు. కొన్ని షరతులతో  మోహన్‌ డబుల్‌ క్లిక్‌లో చేరారు.  

►రోసెన్‌బ్లాట్ -మోహన్‌లు కలిసి డబుల్‌క్లిక్‌ను అడ్వర్టైజింగ్ ఎక్స్‌ఛేంజ్, కోర్ యాడ్ టెక్నాలజీ తో పాటు యాడ్‌ నెట్‌ వర్క్‌ను విస్తృతం చేసేందుకు కృషి చేశారు. 

►యాడ్ నెట్‌వర్క్‌పై కంపెనీగా మార్చేందుకు వారిద్దరూ కలిసి బిజినెస్‌ ప్రణాళికల్ని 400 స్లైడ్‌లలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ తయారు చేశారు. 2005 డిసెంబర్ నెలలో డబుల్‌ క్లిక్‌ - హెల్‌మెన్‌ అండ్‌ ఫ్రైడ్‌ మెన్‌ బోర్డ్‌కి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ అందించారు.  

► 2007 ఏప్రిల్ 13న గూగుల్‌ 3.1 బిలియన్లకు డబుల్‌ క్లిక్‌ను కొనుగోలు చేసింది. దీంతో గూగుల్‌ యాడ్‌ నెట్‌ వర్క్‌ దశ మారిందని గూగుల్ ఎగ్జిక్యూటివ్ సుసాన్ వోజ్కికీ నమ్ముతారు. 2007లో అధికారికంగా గూగుల్‌లో మోహన్‌ గూగుల్‌లో చేరారు. సుసాన్ వోజ్కికీ - మోహన్‌లో 15 ఏళ్ల పాటు ఆమె కలిసి పనిచేశారు. 

►ముఖ్యంగా గూగుల్‌ - డబుల్‌క్లిక్‌ ఇంటిగ్రేషన్‌ ప్రాసెస్‌లో కీలక పాత్ర,  2010లో 85 మిలియన్లతో డిస్‌ప్లే అడ్వటైజింగ్‌, ఎక్ఛేంజీ బిడ్డింగ్‌ కంపెనీ ఇన్వైట్‌ మీడియా కొనుగోలులో ముఖ్య పాత్ర పోషించారు.   

►గూగుల్‌లో డిస్‌ప్లే, వీడియో యాడ్స్ విభాగాల్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.  

►2015లో మోహన్ యూట్యూబ్ (గూగుల్ అనుబంధ సంస్థ)లో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా చేరారు. 2010 - 2020 మధ్య కాలంలో యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ ప్రీమియం , యూట్యూబ్ షార్ట్‌లు, యూట్యూబ్ ఎన్‌ఎఫ్‌టిలతో యూట్యూబ్‌లో సరికొత్త ఒరవడిని సృష్టించారు. 

►తాజాగా సుసాన్ వోజ్‌కికి తర్వాత యూట్యూబ్‌ సీఈవోగా మోహన్ ఎంపికయ్యారు

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు