వెండి కొండెక్కింది ఇందుకే..!

29 Jul, 2020 09:55 IST|Sakshi

6రోజుల్లో రూ.13560 జంప్‌

కలిసొస్తున్న సప్లై ఆందోళనలు

డిమాండ్‌ పెంచుతున్న ఆర్థిక రివకరి 

అప్రమత్తత అవసరం అంటున్న నిపుణులు

బంగారం ధర కొత్త రికార్డు స్థాయిని అందుకుంటున్న నేపథ్యంలో వెండి ధర కూడా కొండెక్కింది. కేవలం 6ట్రేడింగ్‌ సెషన్‌లోనే రూ.13560లు లాభపడింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో పాటు, కరోనా వైరస్‌ ప్రేరేపిత లాక్‌డౌన్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచేందుకు ఆయా సెం‍ట్రల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లను తగ్గించడం కూడా బం‍గారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

కలిసొస్తున్న సప్లై ఆందోళనలు: 
సప్లై ఆందోళనలు పెరగడం వెండి ధరకు కలిసొచ్చింది. ఈ ఏడాది వెండి మైనింగ్‌లో ఉత్పత్తి 7శాతం క్షీణించే అవకాశం ఉందని సిల్వర్‌ ఇన్‌స్టిస్యూట్‌ అంచనా వేస్తోంది. దాదాపు 4నెలల లాక్‌డౌన్‌ తర్వాత కొన్ని దేశాల్లో కొన్ని దేశాల్లో ఆర్థిక పునరుద్ధణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సోలార్‌ ప్యానెల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల్లో ముడిపదార్థంగా వినియోగించే వెండికి డిమాండ్‌ పెరిగినట్లు కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

‘‘ఉద్దీపన చర్యలు కొనసాగవచ్చనే అశావహ అంచనాలతో పాటు డాలర్‌ బలహీనత నుంచి బంగారం ర్యాలీ చేస్తోంది. ఈ క్రమంలో వెండి ధరకు కూడా డిమాండ్‌ పెరుగుతుంది. ఇదే డాలర్‌ బలహీనత పారిశ్రామిక లోహామైన వెండికి మరింత కూడా కలిసొస్తుంది’’ అని కోటక్‌ సెక్యూరిటీస్‌ తన నివేదికలో తెలిపింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా వెండి ఈటీఎఫ్‌ నిల్వలు 17379.98 టన్నల రికార్డు స్థాయికి చేరుకున్న సంగతిని బ్రోకరేజ్‌ సంస్థ ఈ సందర్భంగా గుర్తు చేసింది. 

స్థిరంగా పెరుగుతున్న వెండి ధర పట్ల అప్రమత్తత అవసరమని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

ఇప్పటికీ బుల్లిష్‌గానే: సిటీ గ్రూప్‌ 
వెండి ధర మరింత పెరిగే అవకాశం ఉందని సిటీ గ్రూప్‌ ఇంక్‌ అభిప్రాయపడింది. ఈ జూలై 29న ఫెడ్‌ పాలసీ విధానాన్ని ప్రకటించే అవకాశం ఉంది. వడ్డీరేట్లను సున్నా స్థాయిలో ఉంచేందుకు పావెల్‌ మొగ్గుచూపవచ్చు. ఈ విధాన నిర్ణయంతో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. బంగారం ధర ఒత్తిడిలోను కానంతవరకు వెండి ర్యాలీకి ఎలాంటి ఢోకా లేదు. అలాగే ఇటీవల ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పారిశ్రామిక రంగంలో వెండి అవసరం మరింత పెరిగింది. ఇదే బుల్లిష్‌ మూమెంటం కొనసాగితే వచ్చే ఏడాదిలోగా అంతర్జాతీయంగా 10గ్రాముల వెండి ధర 30డాలర్లను చేరుకోవచ్చని సిటీ గ్రూప్‌ అభిప్రాయపడింది. 

మరిన్ని వార్తలు