హైకోర్టు షాక్‌ : ‌ఫ్యూచర్‌ గ్రూపు షేర్లు ఢమాల్

19 Mar, 2021 14:33 IST|Sakshi

సాక్షి,ముంబై:  కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్‌కు  ఢిల్లీ హైకోర్టు షాక్‌ తగిలింది. రిలయన్స్ రీటైల్‌తో  ఫ్యూచర్ గ్రూప్ కిషోర్ బియానీ డీల్‌కు బ్రేక్‌ పడిన నేపథ్యంలో శుక్రవారం స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్  గ్రూపు షేర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ముఖ్యంగా ఫ్యూచర్‌ రిటైల్ రికార్డు స్థాయి పతనాన్ని నమోదు చేసింది. దాదాపు 11 శాతం కుప్పకూలి లోయర్‌ సర్క్యూట్‌ అయింది. అంతేకాదు తాజా పరిణామంతో  సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3,029 కోట్లకు పడిపోయింది. (రిలయన్స్ ‌డీల్‌కు‌ బ్రేక్‌ : బియానీకి భారీ ఎదురుదెబ్బ)

ఫ్యూచర్ రిటైల్ మాత్రమే కాదు, అనేక ఇతర ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల షేర్లు  కూడా పతనమయ్యాయి. ఫ్యూచర్ కన్స్యూమర్ లిమిటెడ్ షేర్లు స్టాక్ మార్కెట్లో 9.15 శాతం పడిపోగా, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ 8.95 శాతం క్షీణించింది. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ లిమిటెడ్ షేర్లు కూడా దాదాపు 10 శాతం, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ షేర్లు 4.99 శాతం తగ్గాయి. గడువులోగా అన్ని రెగ్యులేటరీ ఆమోదాలను పొందడంలో ఫ్యూచర్ రిటైల్ విఫలమైతే, రిలయన్స్ ఈ ఒప్పందానికి దూరంగా ఉండే అవకాశం ఉందని కూడా మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ ప్రభావితమైంది. 

కాగా ఫ్యూచర్ రిటైల్ రూ .24,713 కోట్ల ఒప్పందానికి వ్యతిరేకంగా సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (సియాక్) జారీ చేసిన ఎమర్జెన్సీ అవార్డు (ఇఎ) ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు గురువారం రద్దు చేసింది. కంపెనీ ఉద్దేశపూర్వంగానే  ఉత్తర్వులను నిర్లక్క్ష్యం చేసిందని పేర్కొన్న కోర్టు, బియానీతో ఇతర ప్రముఖుల ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు ఆదేశించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు