భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల విడుదల ఇప్పట్లో కష్టమే!

30 Mar, 2021 14:10 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ)ను ఇప్పట్లో ప్రవేశపెట్టే అవకాశం లేదని చెక్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం స్కోడా పేర్కొంది. ఇతర దేశాల మార్కెట్లతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ వాహనాల ఆవిష్కరణకు భారత్‌లో తగిన పరిస్థితులు లేవని కంపెనీ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈవీల్లో వినియోగించే బ్యాటరీల తయారీకి ఎక్కువ ఖర్చు అవుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడి మార్కెట్‌ ఈవీ బ్యాటరీల ధరలను భరించేందుకు సిద్ధంగా లేదని అభిప్రాయపడ్డారు. అలాగే కేంద్రం ఈవీ బ్యాటరీ ధరల్ని తగ్గించినప్పటికీ పెట్రోలు, డీజిల్‌ వాహనాలతో పోలిస్తే అధికంగా ఉన్నాయని, ఈ ధరలు సమాన స్థాయికి చేరేందుకు మరి కొన్నేళ్ల సమయం పట్టొచ్చని తెలిపారు. మార్కెట్‌ పరిస్థితులు అనుకూలంగా లేనందున ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో ఈవీ వ్యాపారం లాభసాటి కాదని చెప్పారు.

చదవండి:

సింగిల్ ఛార్జ్ తో 800 కి.మీ ప్రయాణం! 

మరిన్ని వార్తలు