World Diabetes Day: డ‌యాబెటీస్ ఉంటే ఆరోగ్య బీమా ఎందుకు తీసుకోవాలి?

13 Nov, 2021 21:21 IST|Sakshi

ప్రతి ఏడాది నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1991లో అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య & ప్రపంచ ఆరోగ్య సంస్థ గుండె రుగ్మతలు వంటి మధుమేహంతో సంబంధం ఉన్న ప్రమాదాల గురించి అవగాహన పెంచడానికి ఒక రోజు అవసరం అని భావించాయి. 2007లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నవంబర్ 14ను ప్రపంచ మధుమేహ దినోత్సవంగా గుర్తిస్తూ 61/225 తీర్మానాన్ని ఆమోదించింది. మధుమేహం అనేది మీ రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మ‌ధుమేహ‌ సమస్య వస్తుంది. 

ఆహారం తీసుకున్న‌ప్పుడు వ‌చ్చే బ్ల‌డ్ గ్లూకోజ్‌ నుంచి శ‌రీరంలో శ‌క్తి ఉత్ప‌త్తి అవుతుంది. ప్యాంక్రియాస్.. ఇన్సులిన్ అనే హార్మోన్‌ను తయారు చేస్తుంది. ఈ హార్మోన్ గ్లూకోజ్‌ను క‌ణాలు గ్ర‌హించేందుకు స‌హాయ‌ప‌డుతుంది. ఒక‌వేళ శ‌రీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉత్ప‌త్తి చేయ‌క‌పోతే.. డయాబెటిస్ సమస్య వస్తుంది. అప్పుడు గ్లూకోజ్ మీ రక్తంలోనే ఉంటుంది. చివరికి, మీ శరీరంలో గ్లూకోజ్ ఎక్కువగా పేరుకొనిపోయి గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి, కంటి సమస్యలు మొదలైన రోగాలు వస్తాయి.

ఆరోగ్య బీమా ఎందుకు?
ప్రస్తుతం మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల ఖర్చు ఆకాశాన్నంటుతోంది. భారతదేశంలో 25 శాతం కుటుంబ ఆదాయం మధుమేహం వంటి రోగాల నయం కోసం ఖర్చు చేస్తున్నారు. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలపై భారీగా భారం పడుతుంది. తద్వారా పిల్లల విద్య, తిరిగి రుణాలు చెల్లించడం, ఇతర ప్రధాన గృహ ఖర్చులను చెల్లించడం కష్టం అవుతుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌ధుమేహం వ్యాది కోసం చేసే ప్ర‌త్యక్ష ఆరోగ్య సంర‌క్ష‌ణ వ్య‌యం 2025 నాటికి 213-396 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకుంటుంద‌ని అంచ‌నా. కొన్ని దేశాలలో, ఇది వారి మొత్తం ఆర్థిక అంచనాలో 40% వరకు ఉంటుంది. 

(చదవండి: ఆకాశంలో అద్భుతం.. 580 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి!)

అందువల్ల, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఆర్థికంగా సంరక్షించుకోవడానికి సమగ్ర ఆరోగ్య బీమా పథకం ఉపయోగపడుతుంది. వేరే వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు ఆరోగ్య బీమా లభించదనే అభిప్రాయం వినియోగదారుల్లో ఉంది. ఆరోగ్య బీమా కొనడానికి వారు తరచుగా వాయిదా వేయడానికి ఇదే కారణం. అయితే, ఈ భావన ఖచ్చితంగా నిజం కాదు. మీకు ముందుగా ఉన్న వ్యాధి ఉన్నప్పటికీ, మీరు సులభంగా ఆరోగ్య బీమాను పొందవచ్చు.

ఆరోగ్య బీమా కొనుగోలు చేసేటప్పుడు మీ వైద్య చరిత్రను వెల్లడించడం చాలా ముఖ్యం. తరచుగా ప్రజలు దానిని వెల్లడించకుండా తప్పు చేస్తారు. అయితే, ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఫలితంగా తర్వాత  క్లెయింలు తిరస్కరించవచ్చు. ఒకవేళ మీకు ప్రీ ఎక్సిటింగ్‌ డిసీజెస్‌- పిఈడి ఉన్నట్లయితే, కొనుగోలు చేయడానికి ముందు పాలసీ నియమనిబంధనలను ఎల్లప్పుడూ జాగ్రత్తగా చదవండి. సబ్ లిమిట్లు, కో పేమెంట్లు, రూమ్ రెంట్ ఛార్జీల కోసం చెక్ చేయండి. ఇలా చేస్తే ఆసుపత్రిలో చేరే సమయంలో మీ స్వంత పాకెట్ నుంచి మీరు డబ్బును చెల్లించాల్సిన అవసరం లేదు.

(చదవండి: Jeff Bezos: నా గుండె పగిలి ముక్కలయ్యింది)

మరిన్ని వార్తలు