ప్రపంచ రికార్డును నెలకొల్పనున్న నటుడు...!

25 Sep, 2021 20:52 IST|Sakshi

పలు అంతరిక్ష సంస్థలు బ్లూ  ఆరిజిన్‌, స్పేస్‌ఎక్స్‌, వర్జిన్‌ గెలాక్టిక్‌ స్పేస్‌టూరిజం కోసం అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్లూ ఆరిజిన్‌, స్పేస్‌ ఎక్స్‌, వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థలు ప్రైవేటు వ్యక్తులతో అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. తాజాగా జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ ద్వారా ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విలియమ్‌ షట్నర్‌ రోదసీ యాత్రకు సిద్దమైతున్నట్లు తెలుస్తోంది.
చదవండి: గంటన్నర పాటు భారీ ప్రకంపనలతో ఊగిపోయిన మార్స్‌...!

ఒకవేళ బ్లూ ఆరిజిన్‌ చేపట్టనున్న ప్రయోగం  విజయవంతమైతే రోదసీ యాత్రను చేపట్టిన అతి పెద్ద వయస్కుడిగా విలియమ్‌ షట్నర్‌ రికార్డును నెలకొల్పనున్నాడు. ప్రస్తుతం విలియమ్‌ షట్నర్‌ వయసు 90. గతంలో ఇదే సంస్థ నిర్వహించిన అంతరిక్షయాత్రలో పాల్గొన్న 82 ఏళ్ల వాలీ ఫంక్‌ అత్యంత పెద్ద వయసురాలిగా రికార్డును నమోదుచేసింది. స్టార్‌ ట్రెక్‌ హాలీవుడ్‌ సినిమాలో కెప్టెన్‌ జేమ్స్‌ టి. కిర్క్‌ పాత్రను విలియమ్‌ షట్నర్ పోషించాడు. అంతరిక్షానికి సంబంధించిన సినిమాలో స్టార్‌ ట్రెక్‌ అప్పట్లో గణనీయమైన విజయాన్ని సాధించింది. 

గత జూలైలో బ్లూఆరిజిన్‌ సంస్థ అధినేత జెఫ్‌బెజోస్‌ కూడినఅతని సోదరుడు మార్క్‌ బెజోస్‌, 82 ఏళ్ల వాలీ ఫంక్, 18 ఏళ్ల ఫిజిక్స్ విద్యార్థి ఆలివర్ డెమెన్ కలిసి అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఆలివర్‌ డెమెన్‌ అతి తక్కువ వయసులో రోదసీ యాత్రను పూర్తి చేసుకున్న వ్యక్తిగా నిలిచి రికార్డు సృష్టించాడు.
చదవండి: Jeff Bezos: జెఫ్‌బెజోస్‌ దెబ్బకు దిగివచ్చిన నాసా..!

మరిన్ని వార్తలు