విండోస్‌ 11 రాకతో స్కైప్ కథ ముగిసినట్టేనా..!

27 Jun, 2021 17:09 IST|Sakshi

మైక్రోసాఫ్ట్‌ కంపెనీ తదుపరి విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కొత్త వర్షన్‌ విండోస్‌ 11 ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. మరింత సరళతరమైన డిజైన్‌తో పాటు, ఆండ్రాయిడ్‌ యాప్స్‌ విండోస్‌లో పనిచేసేలా విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను రూపొందించింది మైక్రోసాఫ్ట్‌. కాగా విండోస్‌ 11 రాకతో ప్రముఖ వీడియో కాలింగ్‌ యాప్‌ స్కేప్‌కు ఎండ్‌ కార్డ్‌ పడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కరోనా మహమ్మారితో జూమ్‌, గూగుల్‌ మీట్‌ వంటి యాప్స్‌కు ఎక్కువ ఆదరణ లభించింది. దీంతో మైక్రోసాఫ్ట్‌  విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో బై డిఫాల్ట్‌గా వీడియో కాలింగ్‌ రానున్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్‌ తీసుకున్న నిర్ణయంతో స్కేప్‌ కనుమరుగయ్యే అవకాశాలున్నాయిని ఐరిష్ & సండే ఇండిపెండెంట్ టెక్ ఎడిటర్ అడ్రియన్ వెక్లర్ పేర్కొన్నారు.

గత పది సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్  సుమారు 8.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో స్కేప్‌ కొనుగోలు అతిపెద్ద డీల్‌గా నిలిచింది. గత సెప్టెంబరులో, మైక్రోసాఫ్ట్ కు చెందిన లింక్డ్ఇన్.. జూమ్,  బ్లూజీన్స్ టీమ్స్ ,స్కైప్ ఉపయోగించి వీడియో సమావేశాలను తన  చాట్‌ ఫీచర్‌లో తెస్తున్నట్లు ప్రకటించగా, అక్టోబర్‌లో, మైక్రోసాఫ్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జిమ్ గేనోర్ మాట్లాడుతూ..స్కైప్ మరింత విస్తరించబోతుందని తెలిపారు.  

ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ బిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేసిన, వందల మిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్న యాప్‌ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. దాంతో పాటుగా కొన్ని రోజుల్లోనే గూగుల్‌ మీట్‌, జూమ్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలు వీడియో కాలింగ్‌ ఫీచర్‌, మీటింగ్‌ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. దీంతో స్కేప్‌పై ఉన్న ప్రజాదరణ కాస్త తగ్గిపోయింది. బహుశా మైక్రోసాఫ్ట్‌ ఈ కారణం చేతనో స్కేప్‌కు ఎండ్‌కార్డ్‌ పలకాలని భావిస్తోందని టెక్‌ ఎక్స్‌పర్ట్స్‌ తెలిపారు.

స్కైప్‌ కు అంతా మేలు చేయలే...!
కరోనా మహమ్యారితో ప్రముఖ వీడియో కాలింగ్, మీటింగ్‌ యాప్‌ జూమ్‌ అత్యంత ఆదరణ ఏర్పడింది. కరోనా మహమ్మారి సమయంలో స్కైప్‌లో ఏలాంటి గ్రోత్‌ కనిపించలేదు. సుమారు 70 శాతం ప్రజలు స్కైప్‌ నుంచి తప్పుకున్నారు. ప్లే స్టోర్‌లో స్కైప్‌ యాప్‌ ఆప్షనల్‌గా ఉంటుంది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసే నాథుడే లేకుండా అయ్యాడు.

చదవండి: గూగుల్‌ ఫోటోస్‌లో ఉన్న ఫీచర్‌ ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ వన్‌డ్రైవ్‌లో..!

మరిన్ని వార్తలు