మైక్రోసాఫ్ట్‌ తర్వాత మరో రెండు స్టార్ట్‌ మెనూలు.. ఎబ్బెట్టుగా ఉందని ఫీడ్‌బ్యాక్‌!

9 Sep, 2021 10:40 IST|Sakshi

StartIsBack Start Menu: విండోస్‌ వెర్షన్‌ కొత్త అప్‌డేట్‌ కోసం యూజర్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అక్టోబరు 5 నుంచి విండోస్‌-11ను యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇదివరకే ప్రకటించింది కూడా. ఆండ్రాయిడ్ యాప్స్‌ సపోర్ట్‌ అందించడంతో పాటు విండోస్‌ 11లో స్టార్ట్ మెనూను ఎడమవైపు నుంచి మధ్యలోకి తీసుకొస్తున్నట్లు అనౌన్స్‌ చేసింది. దీంతో మరికొన్ని కంపెనీలు కూడా ఈ కొత్తతరహాలోనే స్టార్‌ మెనూలను రిలీజ్‌ చేస్తున్నాయి.
 

కొద్దిరోజుల క్రితం స్టార్‌డాక్‌ కంపెనీ ‘స్టార్ట్‌11’ అనే కొత్త స్టార్ట్ మెనూని రూపొందించినట్లు వెల్లడించింది. తాజాగా ‘స్టార్ట్‌ ఈజ్‌ బ్యాక్‌’ కూడా అల్టర్‌నేట్‌ స్టార్ట్ మెనూని రూపొందించినట్లు వెల్లడించింది. దీంతో వీటిల్లోని ఫీచర్స్‌ గురించి నెటిజన్లలో చర్చ మొదలైంది. స్టార్ట్‌ ఈజ్‌ బ్యాక్‌ స్టార్ట్ మెనూని విండోస్ 11 యూజర్స్ ఎవరైనా ప్రయత్నించొచ్చు. ఇందులో కూడా విండోస్‌ స్టార్ట్‌ మెనూలో మాదిరే అన్ని రకాలా ఫీచర్స్‌ ఉంటాయి. అచ్చం విండోస్‌ 7లోని స్టార్ట్ మెనూలానే పనిచేస్తుంది. అలానే యూజర్స్‌ తమకి నచ్చినట్లుగా ఈ మెనూలో మార్పులు చేసుకోవచ్చు.

స్టార్‌డాక్‌ స్టార్ట్‌ మెనూ

కండిషన్‌ అప్లై
విండోస్‌ 11లో మాదిరిగా స్టార్ట్‌ ఈజ్‌ బ్యాక్‌ మెనూ బార్‌ను స్క్రీన్‌ మధ్యలో పెట్టుకోవచ్చు. ఇది కస్టమ్‌ టెక్చర్స్‌, ట్రాన్స్‌పరెన్సీ సెట్టింగ్స్‌, బ్లర్ ఎఫెక్ట్స్‌ను సపోర్ట్ చేస్తుంది. విండోస్‌ 11లోని స్టార్ట్ మెనూ, టాస్క్‌బార్‌లతో పోలిస్తే స్టార్ట్‌ ఈజ్‌ బ్యాక్‌ స్టార్ట్ మెనూ సిస్టం తక్కువ రీసోర్సులను ఉపయోగించుకుంటుంది. ప్రస్తుతం ఈ స్టార్ట్ మెనూ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. నవంబరు వరకు దీన్ని యూజర్స్ ఎవరైనా ఉచితంగా ప్రయత్నించొచ్చు. తర్వాత ఈ మెనూను ఉపయోగించుకోవాలంటే మాత్రం లైసెన్స్ కొనుగోలు చేయాల్సిందే.

స్టార్ట్‌ ఈజ్‌ బ్యాక్‌ స్టార్ట్‌ మెనూ

స్టార్ట్‌ ఈజ్‌ బ్యాక్‌ స్టార్ట్ మెనూ అక్టోబరు 5 తర్వాత విండోస్‌ 11 ఉపయోగించబోయే యూజర్స్‌కి మాత్రమే!. కొసమెరుపు ఏంటంటే.. విండోస్‌ 11, ఆ తర్వాత వస్తున్న మెనూ మార్పుపై చాలామంది పెదవి విరుస్తున్నారు. చాలా ఎబ్బెట్టుగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. నెగెటివ్‌ ఫీడ్‌బ్యాక్‌లతో రివ్యూలను(గెస్ట్‌ ఫీచర్‌) నింపేస్తున్నారు.

చదవండి: ఇంటర్నెట్‌ లేకున్నా.. ఏటీఎం కార్డు వాడండిలా

మరిన్ని వార్తలు