విప్రో కొనుగోళ్ల రూటు

24 Jul, 2020 05:35 IST|Sakshi

రూ.589 కోట్లతో 4సీ సొంతం

న్యూఢిల్లీ:  బ్రిటన్‌లో ఒకానొక అతిపెద్ద సేల్స్‌ఫోర్స్‌ పార్ట్‌నర్‌ కంపెనీ ‘4సీ’ని విప్రో సొంతం చేసుకోనుంది. ఇందుకోసం 68 మిలియన్‌ యూరోలను (సుమారు రూ.589 కోట్లు) చెల్లించనున్నట్టు విప్రో గురువారం ప్రకటించింది. బెల్జియంలోని మెకెలెన్‌ కేంద్రంగా 1997లో 4సీ ఏర్పాటైంది. ఇప్పటి వరకు 500కు పైగా కస్టమర్లకు 1,500 ప్రాజెక్టులను పూర్తి చేసి ఇచ్చింది.

లండన్, ప్యారిస్, బ్రసెల్స్, దుబాయి తదితర దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్, బెనెలక్స్, నార్డిక్స్, యూఏఈ ప్రాంతాల్లో సేల్స్‌ఫోర్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2020 జనవరి చివరితో ముగిసిన ఏడాది కాలంలో కంపెనీ 31.8 మిలియన్‌ యూరోల ఆదాయాన్ని (రూ.275 కోట్లు) నమోదు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ క్వార్టర్‌లో ఈ డీల్‌ పూర్తవుతుందని విప్రో భావిస్తోంది. 4సీ కొనుగోలుతో సంబంధిత ప్రాంతాల్లో సేల్స్‌ఫోర్స్‌ సొల్యూషన్లను అందించే కీలకమైన కంపెనీ గా తాము అవతరించొ చ్చని విప్రో పేర్కొంది. విప్రో ఇప్పటికే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాల్లోని మార్కెట్లలో సేల్స్‌ఫోర్స్‌ సొల్యూషన్లను అందిస్తోంది.

మరిన్ని వార్తలు