కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న విప్రో!

20 Dec, 2022 08:52 IST|Sakshi

కేరళ మసాలా దినుసుల కంపెనీ

న్యూఢిల్లీ: ప్యాకేజ్‌డ్‌ ఫుడ్, మసాలా దినుసుల విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రయివేట్‌ రంగ కంపెనీ విప్రో కన్జూమర్‌ కేర్‌ తాజాగా వెల్లడించింది. ఇందుకు వీలుగా సుగంధ ద్రవ్యాల కంపెనీ నిరాపరాను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. కేరళలో అత్యధికంగా విక్రయమవుతున్న సంప్రదాయ ఆహార బ్రాండ్ల సంస్థ నిరాపరాను సొంతం చేసుకునేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది.

వెరసి ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు డాబర్, ఇమామీ, టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్, ఐటీసీ సరసన చేరనున్నట్లు పేర్కొంది. 1976లో ప్రారంభమైన నిరాపరా మిశ్రమ మసాలా దినుసులకు పేరొందింది. ఈ బ్రాండు పలు రకాల మిశ్రమ దిసుసులతోపాటు.. విభిన్న అప్పడాల తయారీలో వినియోగించే బియ్యపు పిండినీ రూపొందిస్తోంది. ప్రస్తుతం కంపెనీ బిజినెస్‌ కేరళలో 63 శాతం, గల్ఫ్‌ దేశాల నుంచి 29 శాతం నమోదవుతున్నట్లు విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ ఈడీ వినీత్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఈ వార్తల నేపథ్యంలో విప్రో షేరు యథాతథంగా రూ. 390 వద్ద ముగిసింది.

చదవండి: ఇది మరో కేజీఎఫ్‌.. రియల్‌ ఎస్టేట్‌ సంపాదన, భవనం మొత్తం బంగారమే!

మరిన్ని వార్తలు