ఇంజనీరింగ్‌ విద్యార్థులకు విప్రో గుడ్‌ న్యూస్‌

11 Dec, 2020 14:17 IST|Sakshi

 సాక్షి, ముంబై: ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో  2021లో ఇంజనీరింగ్ పూర్తి చేయనున్న ఇంజనీరింగ్‌ విద్యార్థులకు శుభవార్త అందించింది. ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ 2021 ని ప్రకటించింది.  దేశవ్యాప్తంగా మంచి టాలెంట్ ఉన్న ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్‌కు ఉద్యోగాలు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇవ్వబోతోంది. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి స్ట్రీమ్స్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆన్‌లైన్‌ పరీక్ష, హెచ్ఆర్ ఇంటర్వ్యూ  ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. వార్షిక వేతనం రూ.3.50 లక్షలుగా ఉంటుందని విప్రో తెలిపింది.  ఈ మేరకు విప్రో ట్విటర్‌ ద్వారా వివరాలను షేర్‌ చేసింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలు manager.campus@wipro.com  లో లభ్యం.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు