వారంలో రెండు రోజులు ఆఫీస్..!

12 Sep, 2021 14:37 IST|Sakshi

బెంగళూరు: ప్రముఖ ఐటి సంస్థ విప్రో ఉద్యోగులను రేపటి నుంచి కార్యాలయాలకు తిరిగి రావాలని కోరింది. ఉద్యోగులు ప్రస్తుతం వారానికి రెండు రోజులు కార్యాలయం నుంచి పని చేస్తారు అని పేర్కొంది. విప్రో ఛైర్మన్ రిషాద్ ప్రేమ్ జీ ట్విట్టర్ లో దీనికి సంబంధించి ఇలా ట్వీట్ చేశారు... "18 నెలల సుదీర్ఘ కాలం తర్వాత, మా నాయకులు @Wipro రేపు(వారానికి రెండుసార్లు) కార్యాలయానికి తిరిగి వస్తున్నారు. పూర్తిగా వ్యాక్సిన్ ఇచ్చాము, అందరూ కార్యాలయానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు" అని అన్నారు. (చదవండి: జుకర్‌బర్గ్‌పై ట్రంప్‌ అనుచిత వ్యాఖ్యలు)

విప్రో కార్యాలయంలో ప్రవేశించేటప్పుడు ఉష్ణోగ్రత తనిఖీలు, క్యూఆర్ కోడ్ స్కాన్లతో సహా కోవిడ్-19 సంబంధిత భద్రతా ప్రోటోకాల్స్ గురించి ఒక వీడియోను ఆయన షేర్ చేశారు. జూలై 14న జరిగిన కంపెనీ 75వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రేమ్ జీ భారతదేశంలోని ఉద్యోగులలో 55 శాతం మందికి టీకాలు వేసినట్లు చెప్పారు. విప్రోలో ప్రస్తుతం సుమారు రెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచ శ్రామిక శక్తిలో మూడు శాతం కంటే తక్కువ మంది కార్యాలయం నుంచి పనిచేస్తున్నారని ప్రేమ్ జీ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు